Health Tips: ఈ రోజుల్లో చాలా మంది పగిలిన మడమలతో అనేక అవస్థలు పడుతుంటారు. నిజానికి ఇది వారి కోసమే. అసలు ఈ సమస్య ఎందుకు వేధిస్తుంది, దీనిని ఎలా నివారించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. నిజానికి పగిలిన మడమలు అనేవి శరీరానికి బయటి నుంచే అయ్యే సంఘర్షణ కారణంగానే కాదని, అంతర్గత పోషకాహార లోపాల వల్ల కూడా సంభవిస్తాయని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరం పొడిబారడం లేదా పోషకాహార లోపం కారణంగా ముందుగా వాటి ప్రభావాలు పాదాలు, మడమలపై కనిపిస్తాయని చెబుతున్నారు.
READ ALSO: Anil Ravipudi: మెగాస్టార్‌కు ఆ విషయంలో నో చెప్పా: డైరెక్టర్ అనిల్ రావిపూడి
ఈ చిట్కాలతో ఉపశమనం..
నిజానికి పగిలిన మడమల నుంచి ఉపశమనాన్ని అందించే పలు చిట్కాలను వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. విటమిన్ సి, విటమిన్ బి3 లోపం కారణంగా చర్మం బలహీనపడుతుందని, చర్మానికి సరైన పోషకాహారం లేనప్పుడు, అది పగుళ్లు రావడం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ సమస్యను నివారించడాకి మీ ఆహారంలో ఉసిరి, నిమ్మ, నారింజ, ఆకుపచ్చ వంటివి, అలాగే తృణధాన్యాలను చేర్చుకోవాలని సూచించారు. ఇంకా మడమలు పగలడానికి చాలా కారణాలు ఉన్నాయని, మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఈ సమస్యకు కారణం అవుతాయని చెబుతున్నారు.
ప్రతి రాత్రి కొద్దిగా వెచ్చని కొబ్బరి నూనెను మడమలకు పూయడం వల్ల ఈ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. పాదాలను గోరువెచ్చని నీటిలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిపి కాసేపు నానబెట్టడం వల్ల చర్మం మృదువుగా మారుతుందని సూచించారు. పగుళ్లపై తేనె రాయడం వల్ల నొప్పి తగ్గుతుందని, అలాగే పండిన అరటిపండును మెత్తగా చేసి మడమలకు పూయడం వల్ల సహజ తేమ లభిస్తుందని తెలిపారు. ఇంకా బియ్యం పిండి, తేనెతో సున్నితంగా పగిలిన మడమలకు స్క్రబ్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.