CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
- పెయిన్ కిల్లర్ల విచ్చలవిడి వాడకంపై CDSCO హెచ్చరిక
- యాంటీబయోటిక్స్‌తో యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ముప్పు
- డాక్టర్ సూచించిన మోతాదు, వ్యవధినే పాటించాలని సూచన
- ప్రిస్క్రిప్షన్ లేకుండా H, H1 మందులు విక్రయించొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CDSCO Warning : చిన్నపాటి తలనొప్పి, జ్వరం లేదా జలుబు రాగానే వైద్యుడిని సంప్రదించకుండా నేరుగా మెడికల్ షాపునకు వెళ్లి నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్లు), యాంటీబయోటిక్స్ కొనుగోలు చేసి వాడటం మన దేశంలో పరిపాటిగా మారింది. అయితే, ఈ సొంత వైద్యం అలవాటు మన ప్రాణాల మీదికి తెచ్చే పెద్ద సమస్యగా మారుతోందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించిన భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) తాజాగా ప్రజలకు, వైద్యులకు , మెడికల్ షాపుల యాజమాన్యాలకు అత్యంత కీలకమైన హెచ్చరికలు, మార్గదర్శకాలను జారీ చేసింది.
కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం.. పనిచేయకుండా పోతున్న యాంటీబయోటిక్స్
వైద్యుల పర్యవేక్షణ లేకుండా నాన్-స్టెరాయిడల్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) అని పిలిచే పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌ను మితిమీరి వాడటం వల్ల మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) స్పష్టం చేసింది. పరిశోధనల ప్రకారం, ఏళ్ల తరబడి సొంతంగా పెయిన్ కిల్లర్లు వాడే వారికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్) వచ్చే ప్రమాదం 1.26 రెట్లు ఎక్కువగా ఉంటుందని తేలింది. దీనికితోడు అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడటం వల్ల శరీరంలో ‘యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్’ పెరిగిపోతుందని, కాలక్రమేణా ఆ మందులు శరీరంలో అసలు పనిచేయని స్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది. ‘ఔషధాలు , సౌందర్య సాధనాల చట్టం’ ప్రకారం ఈ రకమైన మందులను డాక్టర్ అధీకృత ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది.
Also Read
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
- Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే 'సొరకాయ సర్వపిండి' తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
ప్రజలకు సీడీఎస్సీఓ సలహాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్వయంగా మందులు వాడే అలవాటును ప్రజలు తక్షణమే మానాలని సిడీఎస్సీఓ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ ఏమాత్రం అవసరం లేదని, నొప్పి లేదా జ్వరం పదేపదే వస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యుడిని కలిసి అసలు సమస్యను గుర్తించాలని సూచించింది. వైద్యులు సూచించిన వ్యవధి వరకే మందులు వాడాలని, గతంలో మిగిలిపోయిన పాత మాత్రలను వాడటం కానీ, ఇతరులకు ఇవ్వడం కానీ చేయకూడదని తెలిపింది. ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు, డీహైడ్రేషన్ లేదా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారు, వయోవృద్ధులు పెయిన్ కిల్లర్లు తీసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్‌కు తమ పాత ఆరోగ్య వివరాలను తెలియజేయాలని పేర్కొంది.
వైద్యులు, మెడికల్ షాపులకు కఠిన ఆదేశాలు
రోగులకు మందులు రాసేటప్పుడు వైద్యులు వారి వయస్సు, ఆరోగ్య స్థితిని పరిగణనలోకి తీసుకోవాలని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఆదేశించింది. సాధ్యమైనంత తక్కువ మోతాదులో, తక్కువ కాలపరిమితికి మాత్రమే పెయిన్ కిల్లర్లను సూచించాలని, గుండె , కిడ్నీ బాధితుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. అదే సమయంలో, మెడికల్ షాపులు , పంపిణీదారులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ‘షెడ్యూల్ హెచ్’ , ‘షెడ్యూల్ హెచ్1’ కేటగిరీకి చెందిన మందులను విక్రయించడాన్ని కఠినంగా నిషేధించింది. ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు మందుల వాడకంపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, రోగులకు సరైన కౌన్సెలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవాలని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!