Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sorakaya Sarvapindi: తెలంగాణ పల్లెటూరి వంటలంటేనే నోరూరించే రుచులు, ఆరోగ్యానికి మేలు చేసే సంప్రదాయ పద్ధతులు గుర్తుకొస్తాయి. అందునా కట్టెల పొయ్యి మీద చేసే సాంప్రదాయ వంటకాల్లో “సర్వపిండి”కి ఉండే క్రేజ్ స్పెషల్. సాధారణంగా ఉల్లిగడ్డలతో చేసే సర్వపిండి అందరికీ తెలుసు.. అయినా తాజా సొరకాయ తురుముతో తయారు చేసే ‘సొరకాయ సర్వపిండి’ ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌గా మారింది. ఇది కేవలం జిహ్వచాపల్యాన్ని తీర్చడమే కాదు.. శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను సైతం అందిస్తుంది. ఇది ఎలా చేయాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
తయారీ విధానం:
స్వచ్ఛమైన బియ్యం పిండిలో తాజా సొరకాయ తురుమును కలపాలి. ఇలా చేయడం వల్ల పిండికి మంచి మెత్తదనం, తేమ వస్తాయి. దీనికి పల్లీలు, నువ్వులు, ముందే నానబెట్టుకున్న శనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు జోడించాలి. మసాలా కోసం అప్పటికప్పుడు రోట్లో నూరిన జీలకర్ర-వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు వేసి పిండిని ముద్దలా కలుపుకోవాలి. సొరకాయలోనే తగినంత నీటి శాతం ఉండటం వల్ల అదనంగా నీళ్లు పోయకుండా సొరకాయ రసంతోనే పిండిని కలపడం దీని స్పెషల్.
Also Read
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
కట్టెల పొయ్యిపై దోరటి కాల్పు:
మందపాటి సర్వపిండి గిన్నె లేదా అల్యూమినియం పాత్రకు కొద్దిగా నూనె రాసి, పిండిని పల్చగా ఒత్తుకోవాలి. పిండి మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు చేసి, అందులో నూనె చుక్కలు వేసుకోవాలి. దీనివల్ల వేడి అన్ని వైపులా సమంగా చేరి సర్వపిండి లోపలి వరకు కరకరలాడుతూ, దోరగా కాలుతుంది. అంతే అదిరిపోయే ఘుమఘుమలాడే సోరకాయ సర్వపిండి రెడీ అయిపోతుంది. దీనిని కట్టెల పొయ్యిపై నెమ్మదిగా కాల్చుకోవడం వల్ల వచ్చే ఆ సహజమైన పొగ సువాసన, అడుగున ఏర్పడే దోరటి పెళుసుదనం దీనికి అద్భుతమైన రుచిని తెచ్చిపెడతాయి. డీప్ ఫ్రై స్నాక్స్‌కు బదులుగా తక్కువ నూనెతో, పోషకాలతో రెడీ అయ్యే ఈ ‘సొరకాయ సర్వపిండి’ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేందటే సాయంత్రం వేళల్లో టీతో పాటు తీసుకోవడానికి బెస్ట్ హెల్తీ ఆప్షన్‌గా పని చేస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు ఇదే..:
* శరీరానికి సహజ చలువ, హైడ్రేషన్: సొరకాయలో దాదాపు 90 శాతానికి పైగా నీటి శాతం ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి సహజంగా చలువ చేస్తుంది.
* సులభ జీర్ణక్రియ & బరువు నియంత్రణ: ఇందులో పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు రావు. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉండి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది.
* ప్రొటీన్, కాల్షియంల మేళవింపు: పిండిలో కలిపే శనగపప్పు, పల్లీలు శరీరానికి మంచి నాణ్యమైన ప్రొటీన్‌ను అందిస్తాయి. అలాగే నువ్వుల ద్వారా లభించే పుష్కలమైన కాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది.
* రోగనిరోధక శక్తి పెంపు: రోట్లో నూరిన తాజా వెల్లుల్లి, జీలకర్ర జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి హెల్ప్ అవుతాయి.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!