DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP CV Anand: తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాల్లో కొన్ని విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. పండుగ సందర్భంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. అత్యంత విచారకరమైన విషయమేమిటంటే.. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. ఈ చేదు వార్తను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా వెల్లడించారు. నిమజ్జనం సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు సంఘటనల వల్ల ఈ ప్రాణనష్టం, గాయాలు సంభవించాయని తెలిపారు. బందోబస్తులో ఉన్న ఓ ఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. పఠాన్‌చెరువులో ఆరుగురు యువకులు, ఖైరతాబాద్, నిర్మల్‌లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అలాగే డీజే సౌండ్స్‌తో గుండెపోటు గురై మరో వ్యక్తి మృతి చెందారు. ఇలా పలు ఘటనల్లో 13 మంది మృతి చెందడం బాధాకరమని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఈ ఏడాది నిమజ్జనం నిర్వహణపై డీజీపీ మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను పంచుకున్నారు. ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1.24 లక్షల వినాయక విగ్రహాలను మండపాల్లో ప్రతిష్టించారు. ఇవే కాకుండా ప్రజలు తమ ఇళ్లలో, గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్మెంట్లలో స్వయంగా పెట్టుకున్న విగ్రహాలను కూడా కలుపుకుంటే, రాష్ట్రవ్యాప్తంగా వినాయక విగ్రహాల సంఖ్య ఏకంగా 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని వివిధ చెరువులు, జలాశయాల వద్ద ఎంతో కోలాహలంగా నిమజ్జన వేడుకలు సాగాయి. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులను నియంత్రించడానికి, ఎటువంటి గొడవలు జరగకుండా చూడటానికి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ తో పాటు భద్రతను కూడా పర్యవేక్షించారని వివరించారు. అంత విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, ఈ దురదృష్టకర ప్రమాదాల్లో 13 మంది చనిపోవడం, 26 మంది గాయపడటం తీవ్ర విచారాన్ని నింపింది.
Also Read
- Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
- BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
- WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
- Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
-
YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
-
Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
-
Hyderabad: రూ.16 కోట్ల చిట్టీల మోసం.. ప్రధాన నిందితురాలు సీత అరెస్ట్
-
Legendary Singer Biopic: ఆ లెజెండరీ సింగర్ కథతో రెహమాన్ సినిమా.. నిజమేనా?
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!