నువ్వులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నువ్వులతో ఎన్నో రకాల వంటలను చేస్తారు.. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇవి రెండు రకాలు అవి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు.. నల్ల నువ్వులలో కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఆహారంలో నల్ల నువ్వులను ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది జుట్టు, చర్మానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి నల్ల నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల నువ్వులలో పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు తగినంత పరిమాణంలో కనిపిస్తాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది..
నువ్వులు రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో క్యాల్షియం, కాపర్ మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.. రోగాల బారిన పడకుండా కాపాడుతాయి..
నల్ల నువ్వులు యాంటీఆక్సిడెంట్ల గొప్ప మూలం. ఇది అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. నల్ల నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఈ గింజల్లో ఉండే గుణాలు మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గిస్తుంది..
విటమిన్ B6, మెగ్నీషియం, అనేక పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి.. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది..
ఇకపోతే వీటిలో పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు తగినంత పరిమాణంలో కనిపిస్తాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.