మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం కారణంగా జనాల్లో లేని పోనీ సమస్యలు వస్తున్నాయి.. ఎప్పుడు వినని వింత రోగాలు కూడా వస్తున్నాయి..అయితే రోగాలు వచ్చిన తర్వాత పరిగెత్తడం కంటే రాకముందే జాగ్రత్త పడటం మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అందుకోసం మన వంటిల్లే మనకు రక్ష.. ఒక్కో మసాలా దినుసు ఒక్కో రోగానికి చెక్ పెడుతుంది.. వంటల్లో సువాసనల కోసం వాడే ఈ యాలుకలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..సాధారణ యాలకుల వలె నల్ల యాలకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. నల్ల యాలకులను వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు..ఈరోజు మనం నల్ల యాలుకలు గురించి తెలుసుకుందాం..
శరీరంలో ఉండే నొప్పులు, వాపులను తగ్గించడంలో ఇవి చక్కగా పని చేస్తాయి. అంతేకాకుండా నల్ల యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి కణాల ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేయడంలో దోహదపడతాయి. ఈ యాలకులను వాడడం వల్ల గుండె జబ్బులు, క్యాన్స్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.. దంతాలు, ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగిస్తారు.. మలబద్దకం, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అలాగే వీటిని వాడడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి.
దగ్గు, బ్రాంకైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ నల్ల యాలకులను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. ఇక శరీరంలో ఉండే మలినాలను కూడా బయటకు పంపిస్తుంది..శరీరంలో ఉండే రక్తనాళాలను వ్యాకోచించేలా చేసి రక్తప్రవాహాన్ని మెరుగపరుస్తాయి. తద్వారా రక్తపోటు కూడా అదుపులోకి వస్తుంది. ఈ విధంగా నల్ల యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా పురుషులకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.. లైంగిక సమస్యలను తగ్గిస్తాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఏదైనా లిమిట్ గానే తీసుకుంటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు..