Fruits For Good Health: మనిషి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ముఖ్యంగా పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. మరి మన ఆరోగ్యానికి ఎక్కువ ఉపయోగపడే పండ్లు ఏంటి? వాటి వివరాలేంటో ఒకసారి చూద్దాం..
దానిమ్మ:
దానిమ్మ పండు కిడ్నీ స్టోన్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, బ్రెయిన్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. రక్తపోటును కూడా కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జామకాయ:
జామకాయలో ఉండే పోషకాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా, సెల్ డ్యామేజ్ ను తగ్గించడంలో కూడా జామకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
Indian Naval Power: పాక్‌ను గడగడలాడించిన మిగ్-29 విమానాలు..
పైనాపిల్:
పైనాపిల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గట్ హెల్త్‌ను మెరుగుపరచి జీర్ణక్రియను సులభం చేస్తుంది.
కివి:
కివి పండు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది నిద్ర సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా చర్మానికి సహజ కాంతిని అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
కర్బూజా:
కర్బూజా పండు కంటి ఆరోగ్యానికి అద్భుతమైనది. అలాగే ఇది గుండె సంబంధిత వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని ఇమ్యూనిటీని పెంచి శరీరాన్ని బలంగా ఉంచుతుంది.
Radhakumari Success: ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. చరిత్ర సృష్టించిన రాధాకుమారి..
బొప్పాయి:
బొప్పాయి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఆరెంజ్:
ఆరెంజ్ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.