ప్రస్తుతం ఉన్న బీజీ లైఫ్ లో చాలా మంది తమ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎక్కువ శాతం మనకు నేచురల్ గా లభించే ఆహార పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వేరే దేశంలో పండే అవకాడో.. మన దేశంలో పండే ఉసిరిలో సమానమైన పోషకాలు ఉంటాయిన హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఉసిరికి, అవకాడోకు సమానమైన ప్రాముఖ్యత ఇస్తే.. భారత దేశం అత్యంత ఆరోగ్యకరమైన దేశంగా మారుతుందంటున్నారు.
Read Also: Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు..
డయాబెటిస్ ఉన్న రోగులకు ఈ ఉసిరి ఎంతో ఉపయోగపడుతుందని.. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభం వాత్స్యా తెలిపారు. ప్రతిరోజూ ఉసిరి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి.అయితే అవకాడో మన దేశంలో ఎంతో ఖరీదైన పండు.. చాలా తక్కువ శాతం మంది ఈ పండ్లను కొనుగోలు చేసి తింటున్నారు. అయితే ఈ అవకాడోను ఎక్కువగా టోస్ట్ లోనూ.. సలాడ్ గా వాడుతున్నారు. అవకాడోలోని అన్ని పోషకాలు మన దేశంలో లభించే ఉసిరిలోనూ ఉన్నాయని న్యూట్రిషియన్ ఎక్స్ పర్ట్ తెలిపారు. ఉసిరిలో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని.. అంతేకాకుండా వృద్ధాప్యాన్ని కూడా తగ్గిస్తుందన్నారు.. ఉసిరి చర్మం, జుట్టుకు సహజ సౌందర్య టానిక్‌గా కూడా పనిచేస్తుందన్నారు. ఇది ముడతలను తగ్గించి జుట్టును మెరిసేలా చేస్తుందని చెప్పుకొచ్చారు.
Read Also: Leopard Attack: పర్యాటకుల వాహనంపై దూసుకొచ్చిన చిరుతపులి..
ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణం చెందకుండా నిరోధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ధమనులను స్పష్టంగా ఉంచడానికి, రక్తపోటును నియంత్రణలో ఉంచేందకు దోహదం చేస్తుందని డాక్టర్ వాత్స్యా తెలిపారు. ఒక చిన్న ఉసిరి రోజువారీ విటమిన్ సి అవసరాన్ని తీర్చగలదు. ఇంకా, ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Read Also:Benefits of Bananas: అరటి పండ్లలో ఉండే పోషక విలువల గురించి మీకు తెలుసా..
, అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అనే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని..హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లోని డయాబెటాలజిస్ట్ డాక్టర్ సోమనాథ్ గుప్తా తెలిపారు. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివని.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయన్నారు. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉండడంతో.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందన్నారు. నాడీ వ్యవస్థకు అవసరమైన పొటాషియం, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా అవకాడాలో ఉంటాయని.. చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం.. మీరు వీటిని ఫాలో అయ్యే ముందు.. న్యూట్రిషియన్ ని కలిసి సలహా తీసుకుంటే మంచింది.