వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో తరచూ కురిసే వర్షాల వల్ల ఇంటి గోడలు తడుస్తాయి. దీంతో దెబ్బతినే అవకాశం ఉంటుంది. పాతి ఇళ్లు అయితే వర్షాలకు తడిసి కూలిపోయే ప్రమాదం ఉంది. ఇంటి గోడల తేమ, వాటికి అనుకొని ఉండే ఫర్నిచర్ క్వాలిటీని కూడా దెబ్బతీస్తుంది. సాధారణ పెయింట్ వేసిన గోడలు తేమను బంధించే అవకాశం ఉంటుంది. దీంతో తడిగా ఉండే ప్రదేశంలో పాచెస్, పైలింగ్ రావచ్చు. దీన్ని నివారించడానికి గోడలపై ల్యామినేట్ షీట్లు, ప్యానెల్స్ ఫిక్స్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
READ MORE:Wedding: కూలర్ వివాదం.. పెళ్లికి నిరాకరించిన వధువు.. వరుడి బాధ వైరల్..
అవి క్వాలిటీ ల్యామినేట్స్ దృఢంగా ఉంటాయి. ఇవి తేమ రాకుండా అడ్డుకుంటాయి. పెయింట్ మాదిరిగా ల్యామినేట్ తేమను గ్రహించదు. ఇంట్లో తేమ ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. యాక్రిలిక్ ల్యామినేట్స్ సాధారణ ల్యామినేట్స్ కంటే ఉత్తమం. కిచెన్ వంటి అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఫింగర్‌ప్రింట్, సెల్ఫ్-హీలింగ్ లక్షణాలతో కూడిన ల్యామినేట్స్ ఉపయోగించాలి. ఈ ల్యామినేట్స్ తేమను బాగా నిరోధించడంతో పాటు మరకలు ఏర్పడకుండా చూస్తాయి. వాటిని శుభ్రపరచడం, మెయింటెన్ చేయడం కూడా చాలా సులభం. యాంటీ-ఫింగర్ ప్రింట్ ఫీచర్ ఉపరితలాలు మురికిగా లేకుండా చేస్తుంది. సెల్ఫ్-హీలింగ్ అనేది ప్రాపర్టీపై ఉన్న చిన్న గీతలు కాలక్రమేణా మాయమయ్యేలా చేస్తుంది. దీంతో గోడలు, ఫర్నీచర్ రెండూ నాశనం కాకుండా ఉంటాయి.
READ MORE: No Fish, No Wedding: చేపలు, మాంసాహారం పెట్టలేదని పెళ్లిలో వధువు కుటుంబంపై దాడి..
ఫర్నీచర్ ను కాపాడుకోండి ఇలా..
గోడలకు ఉన్న తేమ ఫర్నీచర్ అంచులను నాశనం చేస్తుంది. తేమ కారణంగా ఫర్నీచర్ ఉబ్బడంతో పాటు రంగు మారుతుంది. యూపీవీసీ (uPVC) ఎడ్జ్‌బ్యాండ్స్ ఉపయోగిస్తే ఫర్నిచర్‌ను తేమ నుంచి రక్షించుకోవచ్చు. ఈ ఎడ్జ్‌బ్యాండ్స్ హై క్వాలిటీ వాటర్ రెసిస్టెంట్స్‌తో తయారవుతాయి. ఇది ఫర్నిచర్‌లోని ప్రధాన పదార్థంలోకి తేమ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ల్యామినేటెడ్ డెకర్, యుటిలిటీ ఫర్నిచర్ కోసం జీరో-జాయింట్ uPVC ఎడ్జ్‌బ్యాండ్స్ వాడితే ఫర్నిచర్ ఎక్కువ కాలం ఉంటుంది.