ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో రోజు వ్యాయామం చేయాలన్న కొందరు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం భోజనం చేసిన తర్వాత అయిన ఒక పది నిమిషాలు నడిస్తే.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిఫుణులు చెబుతున్నారు. అయితే.. భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు కచ్చితంగా నడవాలని.. ప్రముఖ గ్రాస్టో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేధి తెలిపారు. ఆహారం తిన్న తర్వాత కండరాలు ఇన్సులిన్ అవసరం లేకుండా.. రక్తం నుండి గ్లూకోజ్ ను బయటకు తీసేందుకు.. ఈ నడక ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు. ఇది గ్యాస్.. నిలుపు దలను చలన శీలతను మెరుగుపరుస్తుందన్నారు. రాత్రి భోజనం తర్వాత కూడా పది నిమిషాలు నడవడంతో గుండెల్లో వచ్చే మంటను సైతం తగ్గిస్తుందన్నారాయన. రోజూ భోజనం తర్వాత నడవడం వల్ల ఎన్నో ముఖ్యమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని.. వెల్లడించారు.
వాకింగ్ అనేది తక్కువ ఖర్చుతో కూడిన పని.. అంతే కాకుండా తక్కువ శ్రమతో కూడుకున్నది. అయితే.. వాకింగ్ అనేది రక్తంలో చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. అంతే కాకుండా.. జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. వాకింగ్ చేయడంతో.. తక్కువ చక్కెర స్పైక్ లు, తక్కువ ఇన్సులిన్ ను విడుదల చేస్తాయి. భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల కండరాలు రక్తం నుండి గ్లూకోజ్‌ను ఎలా బయటకు తీస్తాయో, ఇన్సులిన్ అవసరం లేకుండానే ఎలా సంకేతాలు ఇస్తాయో డాక్టర్ సేథి హైలైట్ చేశారు. “అందుకే భోజనం తర్వాత నడకలు అధ్యయనాలలో అనేక మందుల కంటే గ్లూకోజ్ వక్రతను బాగా తగ్గిస్తాయి. మీ కండరాలు ‘జీవక్రియపరంగా మేల్కొంటాయని ఆయన పేర్కొన్నారు.
భోజనం తర్వాత కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు రిఫ్లక్స్ ఎక్కువగా ఉంటుందని డాక్టర్ సేథి చెప్పారు. నెమ్మదిగా నడవడం వల్ల ఆహారం కదులుతూ ఉండడం.. యాసిడ్ ఎక్స్‌పోజర్ తగ్గుతుందన్నారు. రాత్రి భోజనం తర్వాత కేవలం 10-12 నిమిషాలు గుండెల్లో మంటను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల రక్తప్రవాహంలోని కొవ్వు వేగంగా తొలగిపోతుంది. దీర్ఘకాలంలో, ఇది కార్డియోమెటబోలిక్ రిస్క్, ఫ్యాటీ లివర్ మార్కర్స్, వాపు, నడుము చుట్టుకొలతను మెరుగుపరుస్తుంది. ఈ సమాచారం అంతా మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం.. మీరు వీటిని ఫాలో అయ్యే ముందు.. వైద్యలను సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం..