Union Bank Recruitment: చాలా మంది యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటిని చేరుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. అలా ఎవరైతే వారి కెరీర్ బ్యాంకింగ్ సెక్టార్ పరిధిలో ఉండాలని అనుకుంటున్నారో వారందరికీ గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలపై ఓ లుక్కేద్దామా..
READ MORE: Jaish-e-Mohammed: మళ్లీ పుంజుకుంటున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ..!
వెల్త్ మేనేజర్ పోస్టుల కోసం..
తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 250 వెల్త్ మేనేజర్ పోస్టులు ఉన్నట్లు పేర్కొంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా యూనియన్ బ్యాంక్ స్పెషలైజ్డ్ వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగానికి ఉద్యోగులను ఎంపిక చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈనెల 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, 28 వరకు అప్లై చేయడానికి అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. ఈ పోస్టులకు ఎంపిక ఆన్‌లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.
మీకు ఈ అర్హతలు ఉన్నాయా..
వెల్త్ మేనేజర్ పోస్టులకు అభ్యర్థులు ఫుల్ టైమ్ 2 ఏళ్ల ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీబీఏ, పీజీడీబీఎమ్, పీజీపీఎం లేదా పీజీడీఎమ్ కోర్సు పాస్ కావాలి. భారత ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఈ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. అలాగే, బ్యాంకులు, బ్రోకింగ్ కంపెనీలు లేదా అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి. నిస్మ్, ఐఆర్డీఏఐ, ఎన్‌సిఎఫ్‌ఎం, ఏఎంఎఫ్ఐ వంటి సర్టిఫికేషన్లు కలిగి ఉంటే అదనపు ప్రయోజనం చేకూరుతుంది.
READ MORE: India’s SuperGaming: భారతీయ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ సంచలనం.. రూ. 132 కోట్ల సేకరణ..!