Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్ యూజీ 2026’ పరీక్ష వివాదాల నడుమ ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. గత మే 3న దేశవిదేశాల్లోని వందలాది నగరాల్లో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే, పరీక్ష జరిగిన వెంటనే పేపర్ లీక్ ఆరోపణలు, ఇతర అక్రమాలు వెలుగుచూడటంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐ (CBI) దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పారదర్శకతను కాపాడటానికి పాత పరీక్షను రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), జూన్ 21న తిరిగి పరీక్ష (Re-exam) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఫీజు రీఫండ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.
నీట్ యూజీ 2026 అభ్యర్థుల కోసం ఎన్టీఏ అధికారిక రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో ప్రత్యేక రీఫండ్ లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి దీనిని యాక్సెస్ చేయవచ్చు. అభ్యర్థులు తమ రీఫండ్ మొత్తాన్ని పొందడానికి పోర్టల్‌లో ఖచ్చితంగా నమోదు చేయాల్సిన వివరాలు ఏవంటే.. బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ (IFSC) కోడ్, బ్యాంక్ పేరు, క్యాన్సిల్ చెక్ ఫొటో కాపీ కచ్చితంగా ఉండాలి.
Also Read
- TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
- TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
బ్యాంక్ వివరాలను సమర్పించడానికి మే 22 నుంచి మే 27, 2026 వరకు సమయం కేటాయించారు. మే 27వ తేదీ రాత్రి 11:50 గంటలకు ఈ పోర్టల్ లింక్ ముగుస్తుంది. వివరాలు ఒకసారి సమర్పించిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో గతంలో జరిగిన పరీక్ష రద్దయినందున, జూన్ 21న తిరిగి కొత్తగా పరీక్షను నిర్వహించనున్నారు. అక్రమాల వల్ల నష్టపోయిన అర్హులైన విద్యార్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఈ రీ-ఎగ్జామ్, ఫీజు రీఫండ్ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు గడువు ముగిసేలోపు తమ బ్యాంక్ వివరాలను సరిచూసుకుని సమర్పించాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?