Canara Bank Recruitment 2025: ఇది నిజంగానే గుడ్ న్యూ్స్.. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం వచ్చింది. కెనరా బ్యాంక్‌కు పూర్తిగా అనుబంధ సంస్థ అయిన కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (CBSL), ట్రైనీ (సేల్స్, మార్కెటింగ్) పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కానీ.. ఈ కానీ ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Kadapa: దైవ సన్నిధిలో పేకాట.. 10 మందిని అరెస్ట్!
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇక్కడి వరకు ఓకే.. ఈ కానీ ఏంటని ఆలోచిస్తున్నారా.. ఏం లేదండి.. ఉద్యోగం రావాలంటే కచ్చితంగా ఇంటర్వ్యూలో పాస్ కావాల్సి ఉంటుంది. కేవలం దీని ఆధారంగా మాత్రమే జాబ్ వస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 6, 2025 (సాయంత్రం 6 గంటల వరకు). అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
ఈ పోస్టులకు అభ్యర్థి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్‌లో కనీసం 50% మార్కులు సాధించడం తప్పనిసరి. వయోపరిమితి 20 – 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థికి ఆర్థిక సేవలలో అనుభవం ఉంటే, ఆ సర్టిఫికెట్‌ను దరఖాస్తుకు జత చేస్తే గరిష్టంగా 10 ఏళ్ల వయస్సు సడలింపు పొందే వీలు ఉంది. ప్రతి దరఖాస్తుదారుడికి ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
ఎంపిక ప్రక్రియ..
దరఖాస్తులను పరిశీలించిన తర్వాత, అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఇంటర్వ్యూకు సంబంధించిన సమాచారం అంతా అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి పంపించనున్నారు. ఇంటర్వ్యూ కాల్ రావడం ఎంపికకు హామీ ఇవ్వదని, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అర్హత కూడా తనిఖీ చేస్తారని పేర్కొన్నారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22 వేల స్టైఫండ్ లభిస్తుంది. దీనితో పాటు పనితీరు ఆధారంగా రూ.2 వేల వరకు అదనపు ప్రోత్సాహకం కూడా ఉంటుందని పేర్కొంది. యువత శిక్షణ సమయంలోనే స్థిరమైన ఆదాయాన్ని పొందనున్నారు. .
READ ALSO: Late Night Sleep Problems: కొంచెం తొందరగా నిద్రపోండి గురూ… లేట్ నిద్రతో ఎన్ని సమస్యలో తెలుసా!