భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. రైల్వేలో జాబ్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలంటే టెస్టులు, ఇంటర్వ్యూలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, మీకు ఇప్పుడు రైల్వేలో ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1154 పోస్టులను భర్తీ చేయనున్నది.
ఫిట్టర్, వెల్డర్, మెకానిక్(డీజిల్), రిఫ్రిజిరేషన్అండ్ఏసీమెకానిక్, కార్పెంటర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, బ్లాక్ స్మిత్ వంటి ట్రేడుల్లో పోస్టులు భర్తీకానున్నాయి. అప్రెంటిస్ పోస్టులకు పోటీపడే వారు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ పోస్టులకు మెరిట్ జాబితా ఆధారంగా అప్రెంటిస్ శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. SC/ ST/ PWBD/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 25 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్మత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు rrcecr.gov.inను సందర్శించాల్సి ఉంటుంది.