ఏపీ లోని నిరుద్యోగుల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ప్రభుత్వం.. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. గతంలో ఉన్న ఉద్యోగాలకన్నా కూడా ఈ ఏడాది ఉద్యోగాల సంఖ్యను పెంచినట్లు తెలుస్తుంది.. ఇప్పటివరకు విడుదల చేసిన నోటిఫికేషన్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. విజయవాడ లోని ఎస్ఎస్సీ బోర్డ్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నిరుద్యోగుల కు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది..
అర్మత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే.. ఔట్ సోర్సింగ్ విధానం లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. ఈ ఉద్యోగాల కు మొత్తం పోస్టుల వివరాలు..
జూనియర్ అసిస్టెంట్ 11
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ 01
మొత్తం: 12
అర్హతలు..
ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా టైపింగ్ స్కిల్స్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్/ పీజీడీసీఏ/ డీసీఏ/ ఇంజనీరింగ్ సర్టిఫికేట్/ కంప్యూటర్ సబ్జెక్టు తో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఇంకా ఈ ఉద్యోగాల కు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి.. ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోవాలి.. ఈ ఉద్యోగాల కు సంబందించిన మరింత సమాచారం కోసం కింద లింక్ ను ఓపెన్ చెయ్యండి..
అప్లికేషన్ లింక్:https://www.bse.ap.gov.in/
అప్లికేషన్ కొరకు చివరి తేదీ.. జులై 7
ధ్రువ పత్రాల పరిశీలను ఎంపికైన అభ్యర్థు ల జాబితా విడుదల: జులై 11
సర్టిఫికేట్ల వెరిఫికేషన్: జులై 13, 14
కంప్యూటర్ ప్రొఫిఫియన్సీ టెస్ట్: జులై 16, 17
రిజల్ట్స్ : జూలై 19
ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకోండి..