Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌కు మమ్దానీ విజ్ఞప్తి!
- అమెరికాలో పర్యటిస్తున్న కింగ్ చార్లెస్ దంపతులు
- కోహినూర్ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి
- కింగ్ చార్లెస్‌కు మమ్దానీ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ దంపతులు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. కింగ్ చార్లెస్ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే న్యూయార్క్‌లోని 9/11 స్మారక చిహ్నం దగ్గర జరిగిన పుష్పగుచ్ఛ సమర్పణ కార్యక్రమంలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మాట్లాడుతూ.. తనకు కింగ్ చార్లెస్‌ను కలిసే అవకాశం వస్తే.. కోహినూర్ వజ్రం భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని కోరతానని పేర్కొన్నారు. ఈ విషయం అధికారిక చర్చల్లో లేకపోయినా.. రాజుతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ప్రస్తావిస్తానని చెప్పుకొచ్చారు.

Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఇక స్మారక కార్యక్రమంలో కింగ్ చార్లెస్‌ను మమ్దానీ పలకరించారు. ఆ సమయంలో కోహినూర్ వజ్రం అంశం ప్రస్తావనకు వచ్చిందో.. రాలేదో మాత్రం స్పష్టత రాలేదు. ఈ విషయంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ కూడా ఇంకా స్పందించలేదు.
కోహినూర్ వజ్రం భారత్‌కు చెందిన అమూల్యమైన వజ్రం. ఇది బ్రిటిస్ పాలనలో వారి చేతికి చిక్కింది. ప్రస్తుతం బ్రిటిష్ క్రౌన్ జువెల్స్‌లో ఉంది. అయితే ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని భారత్ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. కానీ బ్రిటన్ మాత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా న్యూయార్క్ మేయర్ ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది.
చరిత్ర ఇదే.
105.6 క్యారెట్ల కోహినూర్ వజ్రం భారతదేశంలో పుట్టింది. ఇది మొఘల్ చక్రవర్తులు, పర్షియన్ రాజులు, ఆఫ్ఘన్ పాలకుల చేతుల్లోకి మారుతూ వచ్చింది. చివరగా 1849లో లాహోర్ ఒప్పందం ద్వారా మహారాజా దులీప్ సింగ్ నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇది లండన్‌లోని క్రౌన్ జువెల్స్ ప్రదర్శనలో ఉంది.
భారత్ వాదన
వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగా తీసుకుందని భారత్ ఆరోపించింది. ఇది దేశ చరిత్రకు చెందిన అమూల్య వారసత్వమని.. తిరిగి ఇవ్వాలని భారత్ నిరంతరం కోరుతోంది. అయితే బ్రిటన్ మాత్రం అప్పటి ఒప్పందం ఆధారంగా తమకు చట్టబద్ధ హక్కు ఉందని చెబుతోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు.
#WATCH | "If I were to speak to the King separately from that, I would probably encourage him to return the Kohinoor diamond," says New York Mayor Zohran Mamdani on meeting King Charles III during the wreath-laying ceremony at the 9/11 memorial in New York.
(Source: Mayor Zohran… pic.twitter.com/EExmI1ypqA
— ANI (@ANI) April 29, 2026
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!