సాధారణంగా మనం పాములను చూస్తే.. ఆమడ దూరం పరుగెడతాం. కొందరు దైర్యం చేసి పాము దగ్గరకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. మరికొందరైతే.. ఏకంగా పట్టుకునేందుకే ట్రై చేస్తారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఓ మహిళ ఏకంగా అనకొండ లాంటి పెద్ద కొండ చిలువను భూజాలపై మోసుకుంటూ.. ఎంజాయి చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు అక్కా.. నీకు పాము భయం లేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Read Also:Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా..
ఒక మహిళ తన భుజంపై అత్యంత భారీ కొండచిలువను మోస్తోంది. ఈ కొండచిలువ పరిమాణం చూసి ఎవరైనా భయపడక మానరు. సాధారణంగా చిన్న పాములను చూసినా పరుగులు తీసే మనుషులు ఉంటారు. అలాంటిది ఆ స్త్రీ తన శరీరంపై ఇంత పెద్ద, ప్రమాదకరమైన జీవిని ఎటువంటి భయం లేకుండా మోయడం ఆశ్చర్యకరం. వీడియోలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కొండచిలువ నెమ్మదిగా కదులుతూ ఆ స్త్రీ కాళ్ళలో ఒకదానిని చుట్టుకుంటుంది. అయినప్పటికీ ఆమె ముఖంలో భయం ఏమాత్రం కనిపించదు. చాలా ప్రశాంతంగా, ధీమాగా ఆమె పోజులివ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Read Also:BSF :యుద్ధ విమానాన్ని స్టార్ హోటల్ గా మార్చనున్న ఉజ్జయిని బ్రదర్స్
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరలు అవుతాయి. భారీ పామును ఓ మహిళ సింపుల్ గా భుజాలపై వేసుకుని తిరుగుతుంది. ఆ మహిళను కొండ చిలువ ఏం చేయకపోవడం విశేషం. నెజిజన్లు మాత్రం ఆమె మనిషా..స్నేక్ గర్లా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది ఆర్టీఫిషియల్ ఇంటలీజెన్స్ తో చేసిన మాయాజాలం అని అంటున్నారు. నిపుణులు మాత్రం ఇలాంటి పెద్ద జంతువులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.