హైదరాబాద్ లోని చాదర్‌ఘాట్‌లో కొద్దిరోజుల క్రితం మొండెం లేని తల లభ్యమైన వ్యవహారం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తలకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ తల కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న నర్సు ఎర్రం అనూరాధగా పోలీసులు గుర్తించారు. ఆమె వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు దుండగులు అనూరాధను హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అనంతరం వాటిని ఫ్రీజ్‌లో దాచినట్లుగా పోలీసులు గుర్తించారు.
Also Read : Tiger Nageswara Rao: పులులని వేటాడే పులిని ఎప్పుడైనా చూసారా?
అయితే.. గత వారం మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసీ నది సమీపంలో మొండెం లేని తల దొరకడంతో హైదరాబాద్ లో కలకలం రేపింది. దీంతో ఆ తల ఎవరిదన్నది తెలుసుకోవడానికి పోలీసులు 8 బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. తలను పోస్టర్లుగా ముద్రించి దాని సాయంతో ఆరా తీశారు. అలాగే నగరంలో మిస్సింగ్ కేసులను కూడా విచారణ చేశారు. ఈ క్రమంలోనే ఆ తల నర్సు అనూరాధదిగా పోలీసుల విచారణలో తేలింది. అయితే.. డబ్బు విషయంలోనే అనురాధను దుండగులు హత్య చేసినట్లుగా ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Also Read : Rahul Gandhi: ఇది రాష్ట్రపతిని అవమానించడమే.. కొత్త పార్లమెంట్ వివాదంపై రాహుల్ గాంధీ
అయితే అనురాధను ఎక్కడో హత్య చేసి.. ఇక్కడ తల తెచ్చి పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని అన్నీ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ డీసీపీ ఆనంద్ , మలక్ పేట ఇన్సిపెక్టర్ శ్రీనివాస్ , మలక్ పేట , చాదర్ ఘాట్ క్రైం సిబ్బంది. దర్యాప్తు అనంతరం పూర్తి స్థాయిలో వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.