Israel: యుద్ధం తర్వాత గాజాను ఎవరు పాలిస్తారు.? ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాస్ట్రిప్‌పై దాడులు చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా తుడిచిపెట్టే వరకు విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ చెప్పింది. అమెరికాతో పాటు ఇతర యూరోపియన్, అరబ్ దేశాలు చెప్పినా కూడా ప్రస్తుతం ఇజ్రాయిల్ వినే పరిస్థితిలో లేదు. గాజాపై భూతల దాడులు చేస్తోంది. హమాస్ టన్నెల్ వ్యవస్థతో పాటు కీలక ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే ప్రయత్నంలో ఉంది.
Read Also: South Central Railway: పండుగల సీజన్.. రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఇదిలా ఉంటే పాలస్తీనాకు మద్దతు తెలిపే కొన్ని దేశాలు గాజాను ఇజ్రాయిల్ ఆక్రమించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. 2007 నుంచి హమాస్ మిలిటెంట్లే గాజాను పరిపాలిస్తున్నారు. 24 లక్షల మంది ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం యుద్ధం కారణంగా తీవ్ర మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాలస్తీనాలో మరో భాగమైన వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని పాలస్తీనా అథారిటీ పాక్షిక పరిపాలన నియంత్రణ కలిగి ఉంది. అయితే ఈ నెల ప్రారంభంలో యూఎస్ విదేశాంగ మంత్రి బ్లింకెన్, పాలస్తీనా అధ్యక్షుడి మహ్మద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజా స్ట్రిప్ ప్రాంతాల వివాదానికి సమగ్ర రాజకీయ పరిష్కారం లభిస్తేనే గాజాలో పాలస్తీనా అథారిటీ అధికారాన్ని చెపట్టగలనది అబ్బాస్ అన్నారు.
గాజా ఆక్రమించే ఉద్దేశం లేదు: బెంజిమిన్ నెతన్యాహు
గాజాను ఆక్రమించుకునే ఉద్దేశం తమకు లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ చెప్పారు. ఇజ్రాయిల్ 1967లో గాజా ప్రాంతాన్ని ఆక్రమించింది, ఆ తర్వాత 2005లో ఉపసంహరించుకుంది. అధికారాన్ని పాలస్తీనా అథారిటీకి అప్పగించింది. ‘‘ మేము గాజాను పరిపాలించడానికి ప్రయత్నించము. మేము దానిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించం, కానీ మేము దానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాము’’ అని నెతన్యాహు చెప్పారు. గాజాను పునర్నిర్మించాల్సి ఉందని, పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నెతన్యాహు అన్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!