Monkeypox: గతేడాది ప్రపంచాన్ని కుదిపేసిన మంకీపాక్స్ వ్యాధి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆఫ్రికా దేశం డెమెక్రాట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ లైంగికంగా వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. ప్రస్తుతం ఆ దేశంలో అతిపెద్ద వ్యాప్తి నమోదైంది. ఈ దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. బెల్జియం దేశానికి చెందిన నివాసిమార్చిలో కాంగోకు వెళ్లారని, కొద్ది సేపటికే మంకీపాక్స్ పాజిటివ్ అని తేలిందని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ గురువారం తెలిపింది.
ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీపాక్స్ ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో 14 వేల మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ బుధవారం చెప్పారు.