Site icon NTV Telugu

US: రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ఢిల్లీనే ఆజ్యం పోస్తోంది.. అమెరికా వాణిజ్య సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు

Us

Us

భారతదేశంపై అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదం పరిష్కారం కాకుండా భారతదేశం ఆజ్యం పోస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడంతోనే శాంతికి పరిష్కారం దొరకడం లేదన్నారు. అంతేకాకుండా అమెరికా-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి కూడా ఢిల్లీ పెద్దల నిర్ణయాలే కారణమని విమర్శించారు. భారత్ వైఖరి కారణంగానే ట్రంప్ 50 శాతం సుంకాలు విధించినట్లుగా పీటర్ నవారో చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Uttarakhand: దారుణం.. క్లాస్‌ రూమ్‌లో తిట్టాడని టీచర్‌ను కాల్పులు జరిపిన 9వ తరగతి విద్యార్థి

ప్రస్తుతం భారత్‌పై విధించిన సుంకాల గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు. ఆగస్టు 27 నుంచి యథావిధిగా 50 శాతం సుంకం అమలవుతుందని చెప్పారు. మాస్కోతో సంబంధాలు పెట్టుకుని అమెరికాను భారత్ మోసం చేసిందని ఆరోపించారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయక ముందు రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయలేదని.. యుద్ధం మొదలయ్యాకే రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంతో మాస్కో లబ్ధిపొందుతున్నారు. దీంతో ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రష్యా ఒప్పుకోవడం లేదన్నారు. అమెరికా దిగుమతులపై కూడా భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: UP: యూపీలో దారుణం.. పెళ్లి ఒత్తిడి తేవడంతో మహిళను ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు

ఇక అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత్‌కు చైనా నుంచి ఊహించని మద్దతు లభించింది. 50 శాతం సుంకాన్ని విధించడాన్ని చైనా రాయబారి జు ఫీహాంగ్ తప్పుపట్టారు. ఇక ఆసియాలో ఆర్థిక వృద్ధికి చైనా-భారత్ డబుల్ ఇంజన్లు అన్నారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ త్వరలో చైనాలో పర్యటన చాలా ముఖ్యమైందన్నారు. ఈ పర్యటనకు చైనా ఎంతో ప్రాముఖ్యతనిస్తోందని చైనా రాయబారి అన్నారు.

ఇది కూడా చదవండి: Nitish Kumar: మదర్సా కార్యక్రమంలో నితీష్ కుమార్ షాక్.. టోపీ ధరించేందుకు నిరాకరణ.. వీడియో వైరల్

భారత్‌పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఆసియాలో అత్యధిక సుంకం విధించింది భారత్‌పైనే. 50 శాతం సుంకంతో టాప్‌లో భారత్ ఉంది.

 

Exit mobile version