Submarine Attack: భారత్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై యూఎస్ దాడి.. 80 మంది మృతి..
Submarine Attack: శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రంలో అమెరికా సబ్‌మెరైన్(జలంతర్గామి) ఇరాన్ యుద్ధనౌకపై దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది మరణించినట్లు తెలిసింది. శ్రీలంక దక్షిణ తీరానికికి సమీపంలో ఇరాన్ నౌకపై అమెరికన్ జలంతర్గామి దాడి చేసిందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ధ్రువీకరించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ గతంలో పార్లమెంటుకు మాట్లాడుతూ మౌడ్జ్-క్లాస్ ఫ్రిగేట్ ఐరిస్ డేనాలో దాదాపు 180 మంది ఉన్నారని, అది ద్వీపం నుండి 40 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైందని చెప్పారు. అమెరికా తన సబ్ మెరైన్ నుంచి టార్పిడోలతో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసినట్లు తెలుస్తోంది.
Also Read
ఐరిస్ డేనా భారత్ లో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష 2026, మిలాన్ 2026లో పాల్గొని తిరుగి వెళ్తోంది. ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 25 వరకు బంగాళాఖాతంలో ఈ నౌకదళ విన్యాసాలు జరిగాయి. నౌక నుంచి ప్రమాద సంకేతాలు రాగానే వెంటనే శ్రీలంకన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. 32 మందిని రక్షించినట్లు, సముద్రం నుంచి అనేక మృతదేహాలను స్వాధీనం చేసున్నట్లు అధికారులు ప్రకటించారు. గాయపడిన వారికి గాలే లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిసతున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ జలాల్లో జరిగింది.
తాజావార్తలు
-
Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
-
Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
-
Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
-
West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
-
Babar Azam: కోహ్లీకి బాబర్ ఆజం షాక్.. సొంత దేశం అభిమానులే ఏకిపారేస్తున్నారు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!