PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- PoKలో నిరసనకారులపై పాక్ బలగాల కాల్పులు.
- రావలకోట్ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు కోరిన JAAC.
- జూలై 5 బంద్‌కు ముందు ఇంటర్నెట్, రవాణాపై ఆంక్షల ఆరోపణలు.
- భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో నిరసనలు మిన్నంటాయి. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కాశ్మీరీలను పాకిస్తాన్ సైన్యం దారుణంగా అణిచివేస్తోంది. రావల్కోట్లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మరణించగా, ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. పాక్ భద్రతా బలగాలు, ఫెడరల్ పారామిలిటరీ యూనిట్లు నిరాయుధులైన, శాంతియుత నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
జూలై 5న ప్రకటించిన బంద్‌కు ముందు నిరసనకారులుపై పాక్ భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆరోపించింది. ఈ నేపథ్యంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పీఓకేలో కాల్పులకు పాల్పడిన తర్వాత పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు విధించింది. ప్రధాన రహదారులు మూసేసి, ప్రజలు రాకపోకల్ని పరిమితం చేసినట్లు JAAC తెలిపింది. పీఓకే దిగ్బంధించిన పాకిస్తాన్, అక్కడి ప్రజలకు ఆహార సరఫరాను అడ్డుకుంటోంది.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ఇదిలా ఉంటే ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న JAACను జూన్ 5న పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, గోధుమ కొరత, సబ్సిడీ తగ్గింపుకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ నిరసనలు తక్కువ కాలంలోనే రాజకీయ ఉద్యమంగా మారింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీలో పాకిస్థాన్‌లో నివసించే శరణార్థుల కోసం కేటాయించిన 12 రిజర్వ్ స్థానాలను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!