Pakistan: పాకిస్తాన్‌కి బాలిస్టిక్ మిస్సైల్ టెక్నాలజీ అందించిన చైనా.. 3 కంపెనీలపై యూఎస్ నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: చైనా తన ఆప్తమిత్రుడు పాకిస్తాన్ కోసం కావాల్సిన అన్ని సాయాలు చేస్తోంది. భారత్‌ని ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్‌కి అన్ని విధాల సహాయపడుతోంది. తాజాగా చైనాకు చెందిన కొన్ని కంపెనీలు పాకిస్తాన్‌కి బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమానికి సంబంధించి కీలక వస్తువులు, సాంకేతికతను సరఫరా చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా, చైనాలోని మూడు కంపెనీలపై ఆంక్షలు విధించింది. గ్లోబల్ నాన్‌ప్రొలిఫరేషన్ రిజిమ్‌లో భాగంగా ఈ మూడు కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ శుక్రవారం తెలిపింది.
పాకిస్తాన్‌కి అతిపెద్ద ఆయుధ విక్రయదారుగా చైనా ఉంది. ఇస్లామాబాద్ సైనిక ఆధునీకరణ కార్యక్రమానికి ప్రధాన ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాల సరఫరాదారుగా ఉంది. ప్రస్తుతం చైనాకు చెందిన జనరల్ టెక్నాలజీ లిమిటెడ్, బీజింగ్ లువో లువో టెక్నాలజీ డెవలప్మెంట్ కో లిమిటెడ్, మరియు చాంగ్జౌ ఉటెక్ కాంపోజిట్ కంపెనీ లిమిటెడ్లపై అమెరికా ఆంక్షలు విధించింది.
Also Read
- Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
- Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
- Congo Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా 14 మంది మృతి
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
Read Also: NEET: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల ప్రచారం..
జనరల్ టెక్నాలజీ లిమిటెడ్ బాలిస్టిక్ మిస్సైల్ రాకెట్ ఇంజిన్ లోని భాగాలను కలపడానికి, కంబర్షన్ చాంబర్ ఉత్పత్తిలో బ్రేకింగ్ పదార్థాలను సరఫరా చేయడానికి పనిచేసింది. లువో లువో టెక్నాలజీ డెవలప్మెంట్ కో లిమిటెడ్ మాండ్రెల్స్, ఇతర యంత్రాల సరఫరాకు తోడ్పడింది. వీటిని సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ ల ఉత్పత్తిలో ఉపయోగించవచ్చు. చాంగ్‌జౌలోని ఉటెక్ కంపెనీ డీ-గ్లాస్ ఫైబర్, క్వార్ట్జ్, ఫాబ్రిక్, హై సిలికా క్లాత్ ని సరఫరా చేసింది. వీటన్నింటిని క్షిపణి వ్యవస్థలో వాడుతారు.
సామూహిక విధ్వంసం చేసే ఆయుధాల విస్తరణ, వాటి పంపిణీ సాధానాలు, దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, వాటికి వ్యతిరేకంగా అమెరికా చర్యలు తీసుకుంటుందని విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. పాకిస్తాన్ తన అబాబీల్ క్షిపణి వ్యవస్థను ప్రయోగించిన కొద్ది రోజులకే ఈ ఆంక్షలు వచ్చాయి.
తాజావార్తలు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!