Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్‌ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jensen Huang Third Girlfriend: ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. చైనా మహిళతో సంబంధం ఇప్పటికే సంచలనం సృష్టించగా, తాజాగా మరో మహిళతోనూ ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఆయనకు సంబంధించిన మూడో సంబంధం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
భార్య ఉన్నప్పటికీ చైనా మహిళతో సంబంధం కొనసాగించారనే ఆరోపణలు జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదాన్ని రేకెత్తించాయి. అలిస్ హువాంగ్ అనే చైనా మహిళతో ఆయన పేరు వార్తల్లోకి వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, అలిస్ సింగపూర్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ మెగాస్పీడ్లో గతంలో పనిచేశారు. అమెరికా నిఘా సంస్థలు ఆమెకు చైనా కోసం గూఢచర్యం చేసే సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు ఇప్పటివరకు బహిరంగంగా నిరూపితం కాలేదు. చైనా కూడా గూఢచర్యానికి సంబంధించిన ఆరోపణలను ఖండించింది. ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం ఎన్విడియా తయారు చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్స్. ముఖ్యంగా చైనాకు ఈ చిప్స్ సరఫరా చేయడం అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశంగా మారింది.
Also Read
- Xi Jinping Warns Taiwan: తైవాన్‌కు జిన్‌పింగ్ వార్నింగ్.. స్వాతంత్ర్యానికి అవకాశమే లేదు.. చైనాతో ఏకీకరణ తప్పదు!
- US Deportation Record: ట్రంప్ హయాంలో 23 ఏళ్ల రికార్డు బద్దలు.. ఒక్క ఏడాదిలో 4.83 లక్షల మంది డిపోర్ట్
- Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ఎన్విడియా మహిళా అధికారితోనూ సంబంధం ఉందా?
అలిస్ హువాంగ్‌తో పాటు ఎన్విడియాలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న కింబర్లీ పావెల్‌తో కూడా జెన్సన్ హువాంగ్ పేరు ముడిపడింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, కింబర్లీ పావెల్ ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె జెన్సన్ హువాంగ్‌కు రిపోర్ట్ చేసే అధికారిగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాయిటర్స్ కూడా తనకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ మరో మహిళా ఉద్యోగితో హువాంగ్‌కు సన్నిహిత సంబంధం ఉన్నట్లు కథనం ప్రచురించింది.
మూడో మహిళ ఎవరు?
తాజాగా తెరపైకి వచ్చిన ఈ మూడో మహిళ ఎవరు? ఆమె ఎన్విడియాలో ఏ హోదాలో పనిచేస్తున్నారు? జెన్సన్ హువాంగ్‌తో ఆమెకు ఉన్నట్లు చెబుతున్న సంబంధం ఎంతవరకు నిజం? అనే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. అయితే, ఈ మూడో మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆమె గుర్తింపు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడికాలేదు. ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం చుట్టూ వస్తున్న ఈ కథనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్‌ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
-
Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. ‘స్వాభిమానం’ మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
-
Kiran Abbavaram: వారి కోసమే ‘రియాలిటీ’ మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
-
Ragiri Satyanarayana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణ గౌడ్ అరెస్ట్
-
Best Wood for Furniture: ఇంటి ఫర్నీచర్‌కు ఏ కలప బెస్ట్? టేకు నుంచి శీశం వరకు.. చెదలు పట్టకుండా ఏం చేయాలి?
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!