పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు బలపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించాడు. వైట్‌హౌస్‌లో అసిమ్ మునీర్‌కు ట్రంప్ ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి అసిమ్ మునీర్ ప్రమోట్ చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నట్లు అసిమ్ మునీర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం! ఏం తేల్చిందంటే..!
రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇందులో భాగంగానే సెప్టెంబర్‌లో ట్రంప్ పాకిస్థాన్‌లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాయిటర్స్, రెండు స్థానిక టెలివిజన్ వార్తా ఛానెళ్లు ప్రసారం చేశాయి. పాకిస్థాన్‌కు చెందిన సమా టీవీ ప్రకారం.. దక్షిణాసియా పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 18న పాకిస్థాన్‌లో ట్రంప్ పర్యటించనున్నట్లు కథనాన్ని ప్రసారం చేసింది.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్‌లో ఘోరం.. గుండెపోటుతో 4వ తరగతి విద్యార్థి మృతి
ఇక దక్షిణాసియా పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 18న ట్రంప్ ఇస్లామాబాద్‌లో పర్యటించిన తర్వాత భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని రాయిటర్స్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ ఛానల్స్ తెలిపాయి. ఇదే నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమెరికా అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. 2006లో జార్జ్ డబ్ల్యూ.బుష్ పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆయన తర్వాత ట్రంప్ గనుక పాకిస్థాన్‌లో పర్యటిస్తే మాత్రం ఇదే మొదటి సారి అవుతుంది. ఇదిలా ఉంటే ట్రంప్ పర్యటన గురించి అధికారికంగా తనకు తెలియదని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి రాయిటర్స్‌తో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనంతరం భారత్ ప్రతీకారంగా పాకిస్థాన్‌పై మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అనంతరం ట్రంప్.. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటించారు. తన వల్లే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిందని వెల్లడించారు. దీన్ని భారత్ ఖండించింది. ఇప్పుడు ట్రంప్ పాకిస్థాన్‌లో పర్యటించడం ఆసక్తి రేపుతోంది.