Honey Movie Trailer:’హనీ’ తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా: హీరో నవీన్ చంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honey Movie Trailer:నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది మౌత్ టాక్‌తో నిలబడే సినిమా. ఫిబ్రవరి 6న దయచేసి ఒకసారి థియేటర్ కి రండి. ఇది థియేటర్‌కి చాలా బాగుంటుంది. చూసి బయటికి వచ్చిన తర్వాత ఈ సినిమా వెంటాడుతూనే ఉంటుంది. దివి చాలా అద్భుతమైన నటి, తను తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది, అలాగే దివ్య కూడా చాలా చక్కగా నటించింది. కరుణ కుమార్ గారు ఈ కథకు నన్ను ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను.
READ ALSO: T20I Fastest Centuries: T20I చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన టీమిండియా స్టార్స్ వీరే!
Also Read
డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. సాహిత్యం కోసం చీకటి అనే కథ రాశాను. దాన్ని సినిమా తీద్దామని మా నిర్మాతలు వచ్చారు. మదనపల్లి, పాతబస్తీ, ఒకే ఇంట్లో కొందరు ఉరి వేసుకోవడం ఇలాంటి ఘటనలు చూస్తుంటాం. హనీ సినిమాలో పిల్లి మాయ అనే ఒక వస్తువుని శోధించి సాధించే ఒక వ్యక్తి జీవితం చూపించాం. మెదడు అంతా చీకటి ఉన్నా మనసుల మధ్య జరిగిన ఒక కథ. నిజ జీవిత సంఘటన నుంచి స్ఫూర్తిగా తీసుకుని సినిమా చేయడం జరిగింది. మనిషి మెదడు కంటే పెద్ద దయ్యం లేదనేది ఈ సినిమా యొక్క సారాంశం. ఇదొక ఫ్యామిలీ స్టోరీ. ఇందులో ఎప్పుడు చూడని నవీన్ చంద్ర గారిని చూడబోతున్నారు. ఇలాంటి కాన్సెప్టు ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో రాలేదు. ఈ సినిమాకి ప్రేక్షకులు ఊపిరి పోయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నటుడు రాజా రవీంద్ర, హీరోయిన్లు దివి, దివ్య పిళ్లై, చిత్ర బృందం పాల్గొన్నారు.
READ ALSO: BCCI Budget 2026-27: టీం ఇండియా బడ్జెట్.. బీసీసీఐ ఖజానాలోకి వేల కోట్లు ఎలా వస్తాయంటే?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు