ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి తన నృత్యంతో అదరగొట్టారు.
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ రెస్క్యూ ఆపరేషన్‌లో మొదటిగా నిలిచిన సేవా సభ్యులు, సిబ్బంది ధైర్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
చైనాలో మరో వైరల్ వేగంగా వ్యాపిస్తోంది. దీని కారణంగా చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు అమెరికా, చైనాల మధ్య ప్రయాణ నిషేధం విధించాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌ను డిమాండ్ చేశారు.
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఓ వైపు ఉక్రెయిన్ చర్చలకు ప్రతిపాదనలు పంపుతున్నా.. రష్యా మాత్రం దాడులు చేస్తూనే ఉంది.. ఇక, రష్యాతో నాటో ప్రత్యక్ష పోరుకు దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. ఆ పరిణామాలను నివారించేందుకే ఉక్రెయిన్ విషయంలో రష్యాతో అమెరికా నేరుగా పోరాటం చేయట్లేదని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా రసాయన ఆయుధాలు వినియోగిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.…
తాలిబన్లు.. ఆఫ్ఘనిస్థాను స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతూనే ఉన్నారు.. ఓవైపు అరచకాలు సృష్టిస్తూ తాలిబన్లు దూసుకెళ్తుండగా.. వారిని నిలువరించలేక.. సైన్యం సైతం చేతులు ఎత్తేసింది.. చివరకు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోకి కూడా ఎంట్రీ అయిపోయారు తానిబన్లు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల రాజ్యానికి తెరదించి, ఆ దేశాన్ని పునర్నిర్మించడానికి ఈ రెండు దశాబ్దాలలో…