Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us Plan Behind Al Qaeda Leader Ayman Al Zawahiri Death

Ayman Al-Zawahiri Kill Plan: అతనొక్కడే టార్గెట్.. తెరవెనుక ప్లాన్ ఇది!

Published Date :August 2, 2022 , 11:25 am
By NTV WebDesk
Ayman Al-Zawahiri Kill Plan: అతనొక్కడే టార్గెట్.. తెరవెనుక ప్లాన్ ఇది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

US Plan Behind Ayman Al-Zawahiri Death: 9/11 ఉగ్రదాడుల వెనుక ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన ఐమన్ అల్-జవహరీని మట్టుబెట్టేందుకు అమెరికా ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ, అతడు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని ఆచూకీ కోసం స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత జవహరీ ఆచూకీ లభ్యమవ్వడంతో.. అతడ్ని అంతమొందించేందుకు పక్కా ప్లాన్ రచించారు. తొలుత ఈ ఆపరేషన్‌కు జులై 25వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. అయితే.. అతడ్ని మాత్రమే చంపాలని, కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని జరగకూడదని ఈ ఆపరేషన్‌లో ఓ పక్కా రూల్ పెట్టుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి, ఆఫ్ఘాన్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టారు.

కాబుల్‌లోని తన నివాసంలో జవహరీ బాల్కనీలో ఉన్నప్పుడు, రెండు హెల్‌ఫైర్ క్షిపణులు అతడ్ని లక్ష్యంగా చేసుకున్నాయి. టార్గెట్ కేవలం జవహర్ ఒక్కడే కాబట్టి, ఫైర్ చేయగా భవనంలోని ఒక అంతస్తు మాత్రమే ధ్వంసమైంది. మిగతా భవనమంతా చెక్కుచెదరలేదు. ఈ ఆపరేషన్ కోసం అమెరికా పెద్ద కసరత్తే చేసింది. జవహరీ దినచర్యను దగ్గరుండి పరిశీలించేందుకు ఓ అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బాల్కనీలో ఉన్నది జవహరీనే అని ఆ అధికారి కన్ఫమ్ చేసిన తర్వాత దాడులకు దిగింది. ఈ ఆపరేషన్ సమయంలో జవహరీ కుటుంబ సభ్యులందరూ (భార్య, కుమార్తెలు, మనవళ్లు) ఆ భవనంలోనే ఉన్నారట! అయితే.. వారికి ఎలాంటి హానీ కలగలేదని అధికారులు పేర్కొన్నారు. జవహరీ ఉన్న అంతస్తు మాత్రమే కూలిందని, భవనానికి ఏం కాలేదని క్లారిటీ ఇచ్చారు.

జవహరీని మట్టుబెట్టిన తర్వాత వైట్ హౌస్ నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించారు. డ్రోన్ దాడిలో అతడ్ని అంత చేశామని, 9/11 మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందని ఆయనన్నారు. ‘‘ఉద్రవాద నేత అయిన జవహరీని మట్టుబెట్టాం. ఇంకెప్పటికీ అతడు ఆప్ఘనిస్తాన్‌ను ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా మార్చలేడు. ఉగ్రవాదులెవరూ మిగలకుండా మేం కచ్ఛితంగా ప్రయత్నిస్తాం. 9/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన 3000 మంది కుటుంబాల బాధకు, ఆవేదనకు జవహరీ మరణం ఓ ముగింపని భావిస్తున్నా’’ అని బైడెన్ అన్నారు. అనంతరం ట్విటర్‌లోనూ.. ‘అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే, ఎక్కడ దాక్కున్నా, ఎంత కాలమైనా కనిపెట్టి మట్టుబెడతాం’ అని ట్వీట్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Al Qaeda
  • Ayman Al-Zawahiri Died
  • US Drone Attack
  • US President Joe Biden
  • white house

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions