Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us Iran Talks Failure Impact Pakistan War Crisis

US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

Published Date :April 11, 2026 , 8:12 pm
By Venu Goapl Reddy
  • యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాక్‌కు కష్టమే..
  • యుద్ధంలోకి లాగబడే ఛాన్స్, ఆర్థికంగా కుదేలయ్యే అవకాశం..
US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

US-Iran Talks: అమెరికా-ఇరాన్ మధ్య శాంతికోసం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా చర్చలు ప్రారంభమయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. దీంతో పాకిస్తాన్ ఏదో సాధించినట్లుగా అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తాము సూపర్ పవర్‌గా మారినట్లు దాయాది దేశం తెగ బిల్డప్ ఇస్తోంది.

ఒక వేళ చర్చలు విఫలమైతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటని ఎవరూ ఆలోచించడం లేదు. ఇదే జరిగితే, చర్చలు విఫలం అయితే దాయాదికి దబిడి దిబిడే. మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుంది. ఇప్పటికే చర్చలు కొలిక్కి రాకుంటే, ఒక డీల్ చేసుకోకుంటే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

యుద్ధంలోకి పాకిస్తాన్:

ఈ చర్చలు విఫలమైతే పాకిస్తాన్ యుద్ధంలోకి లాగబడొచ్చు. సౌదీ అరేబియాపై ఇరాన్ దాడులు చేస్తుంది. సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో సౌదీకి మద్దతుగా పాక్ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ ఉద్రిక్తల్ని మరింత పెంచుతుంది.

ముప్పేట దాడి:

ఒక వేళ ఇరాన్ యుద్ధం మళ్లీ ప్రారంభమైతే, పాక్ అంతర్గత పరిస్థితులు కూడా అదుపు తప్పొచ్చు. బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), కైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్లు, మరోవైపు యుద్ధంలోకి ప్రవేశిస్తే ఇరాన్ దాడులకు పాల్పడవచ్చు.

అమెరికా ఒత్తిడి:

ఇదే సమయంలో ఇరాన్‌పై దాడులకు పాక్ తన ఎయిర్ బేసులు ఇవ్వాలని అమెరికా ఒత్తిడి పెంచొచ్చు. ఒక వేళ ఇదే జరిగితే పాక్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇరాన్ తర్వాత, పాక్‌లోనే షియా జనాభా ఎక్కువ. వీరంతా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. ఇటు అమెరికా మాటకు ఒప్పుకోకుంటే, పాక్‌తో అమెరికా సంబంధాలు దెబ్బతింటాయి.

పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ఛాన్స్:

ఓ వైపు యుద్ధం, మరోవైపు అంతర్గత సమస్యలతో ఇప్పటికే పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది. ఒక వేళ సౌదీ తరుపున యుద్ధంలోకి లాగబడితే ఇరాన్ కన్నేర్ర చేయడం ఖాయం. ఇరాన్‌పై దాడికి పాక్ తన ఆర్థిక వనరుల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు, హార్ముజ్ జలసంధి మూసేయడం వల్ల ఇంధనానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇంధన కొరత ట్రాన్స్‌పోర్ట్, విద్యుత్, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Baloch Liberation Army
  • Donald Trump
  • Iran Saudi conflict
  • Middle East War
  • pakistan crisis

తాజావార్తలు

  • US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

  • Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..

  • Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!

  • MS Dhoni Return: ఎంఎస్ ధోనీ ఎప్పుడు ఆడుతాడు.. చెన్నై కెప్టెన్ రుతురాజ్ ఆసక్తికర సమాధానం!

  • Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు అదృష్టం తలుపు తట్టబోయే రాశులు ఇవే! కుబేరుడి అనుగ్రహంతో డబ్బే డబ్బు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions