US Big Bounty: ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల ఫ్రైజ్ మనీ, అమెరికాలో స్థిరనివాసం..
- ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల నజరానా..
- అమెరికాలో స్థిర నివాసం..
- ఇరాన్ ప్రజలకు ట్రంప్ బిగ్ ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Big Bounty: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీని అమెరికా, ఇజ్రాయిల్ వేటాడుతున్నాయి. ఇప్పటికే, తొలి రోజు దాడిలోనే మాజీ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. ఇప్పుడు, కొత్తగా ఎన్నికైన మోజ్తబాను టార్గెట్ చేస్తున్నారు. మోజ్తబాతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన ఇతర సీనియర్ అధికారులను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు.
Read Also: Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!
Also Read
- US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
- Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఇదిలా ఉంటే, వీరి ఆచూకీ తెలిపిన వారికి అమెరికా బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇరాన్ కీలక నేతల సమాచారం ఇచ్చిన వారికి అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 92.47 కోట్లు) రివార్డును ప్రకటించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ‘‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’’ ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రకటన వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్న IRGC నాయకులను పట్టుకోవాలని యూఎస్ ప్లాన్ చేస్తోంది. ఇరాన్ ప్రజలు ఈ సమాచారం ఇస్తే వారికి బహుమతితో పాటు అమెరికాలో స్థిరపడేందుకు అవకాశం ఇస్తామని చెప్పింది.
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజాని వంటి కీలక నేతల్ని అమెరికా కోరుతోంది. మరోవైపు, ఇజ్రాయిల్ అమెరికాలు ఇరాన్‌పై దాడుల్ని తీవ్రం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇరాన్ లోని టార్గెట్లపై భీకర దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ కూడా తన ప్రతీకార దాడుల్ని పెంచింది. ముఖ్యంగా, గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్ దేశాలను టార్గెట్ చేస్తోంది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతోంది.
తాజావార్తలు
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..