Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us Approves First Drug For People With Severe Form Of Fatty Liver Disease

Fatty Liver Disease: “ఫాటీ లివర్ డిసీజ్‌”కి తొలిసారిగా ఔషధం.. ఆమోదించిన ఎఫ్‌డీఏ..

Published Date :March 15, 2024 , 7:01 am
By Venu Goapl Reddy
Fatty Liver Disease: “ఫాటీ లివర్ డిసీజ్‌”కి తొలిసారిగా ఔషధం.. ఆమోదించిన ఎఫ్‌డీఏ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fatty Liver Disease: తీవ్రమైన కాలేయ వ్యాధి ‘ఫ్యాటీ లివర్’కి తొలిసారిగా ఔషధం రాబోతోంది. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారి కోసం డ్రగ్‌ని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గురువారం ఆమోదించింది. మాడ్రిగల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ రూపొందించిన రెజ్‌డిఫ్రా అనే మందు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వులకు సంబంధించిన తీవ్ర రూపమైన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)తో బాధపడుతున్న వారికి ఇది వరంగా మారింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది వ్యాధిని మెరుగుపరుస్తున్నట్లు తేలింది.

గతంలో కాలేయ వ్యాధి NASH ఉన్న రోగులకు వ్యాధిని మెరుగుపరిచేందుకు సరైన మందులేదని ఎఫ్‌డీఏ అధికారి నికోలాయ్ నికోలోవ్ చెప్పారు. రెజ్‌ఢిఫ్రాని ఆమోదించడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనే వీలు కలిగింది. అమెరికాలో నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH) వల్ల 6-8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఈ వ్యాధి తరుచుగా అధిక రక్తకొవ్వు స్థాయిలు, టైప్ 2 మధుమేహం, ఊబకాయం వంటి ఇతర వ్యాధులతో సంబంధాన్ని కలిగి ఉంది.

Read Also: Petrol: ఎన్నికల వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ధరలు తగ్గించిన కేంద్రం

దీని వల్ల రోగి బలహీన పడటంతో పాటు తీవ్రమైన అలసట, చర్మ-కళ్లు పసుపురంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరి సిర్రోసిన్ అనే స్థితికి చేరి కాలేయ వైఫల్యం కూడా సంభవించవచ్చు. అలాంటి సమయాల్లో కాలేయ మార్పిడి అవసరమవుతుంది. నోటి ద్వారా తీసుకునే రెడ్‌డిఫ్రా మాలిక్యూల్‌ని రెస్‌మెటిరమ్ అని కూడా పిలుస్తారు. ఇది NASH యెక్క అంతర్లీన కారణాలను లక్ష్యం చేసుకుంటుంది. ఈ డ్రగ్‌ని రోగులు నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.

966 మంది వ్యక్తులపై 12 నెలల రీసెర్చ్ తర్వాత రెడ్‌డిఫ్రా తీసుకున్న వారు వ్యాధి నుంచి కోలుకున్నట్లు ఇటీవల న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. అయితే, ఈ డ్రగ్ వల్ల డయేరియా, వికారం వంటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్లు గుర్తించారు. అమెరికన్ లివర్ ఫౌండేషన్ ఈ డ్రగ్‌ని ‘‘గ్రౌండ్ బ్రేకింగ్’’ చికిత్సగా ప్రశంసించింది. ఇది ఏప్రిల్ నెలలో అమెరికా రరోగుకు అందుబాటులోకి రానుంది. దాదాపు 15 ఏళ్ల పరిశోధనల ఫలితం ఈ డ్రగ్ అని మాడ్రిగల్ సీఈఓ బిల్ సిబోల్డ్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fatty liver
  • Fatty Liver Disease
  • FDA
  • non-alcoholic steatohepatitis (NASH)
  • Rezdiffra

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions