సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల లక్ష్యంగా అమెరికా దళాలు దాడులు చేస్తోంది. శుక్రవారం సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికన్ ఫైటర్ జెట్‌లు దాడి ప్రారంభించాయి. సిరియా అంతటా అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు దాడులు చేస్తున్నాయి. డిసెంబర్ 13న పాల్మిరాలో ఇద్దరు అమెరికన్ ఆర్మీ సైనికులు, పౌర అనువాదకుడిని ఐసిసి మూకలు చంపిన తర్వాత అమెరికా ఈ దాడులకు దిగింది.
ఇది కూడా చదవండి: HCA – TCA: హెచ్‌సీఏపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన టీసీఏ..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో సిరియాపై అమెరికన్ సైన్యం దాడి చేసింది. ఐసిస్ ఉగ్రవాదులు, మౌలిక సదుపాయాలపై అమెరికా జెట్‌లు దాడులు చేస్తున్నాయి. సిరియా అంతటా అనుమానిత ఆయుధ నిల్వ సౌకర్యాలు, సరఫరా కేంద్రాలు, కార్యాచరణ భవనాలు వంటి అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Illicit Relationship: ప్రియుడితో కలిసి.. భర్తను గొంతు నులిమి చంపిన భార్య.. సంచలన విషయాలు వెలుగులోకి
‘‘సిరియాలో ధైర్యవంతులైన అమెరికన్ దేశభక్తులను ఐసిస్ దారుణంగా హతమార్చిందని.. హంతక ఉగ్రవాదులపై అమెరికా చాలా తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటుందని ఇందు మూలంగా తెలియజేస్తున్నా. సిరియాలోని ఐసిస్ బలమైన ప్రాంతాలపై మేము చాలా బలంగా దాడి చేస్తున్నాము. రక్తంతో తడిసిన ఈ ప్రదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఐసిస్‌ను నిర్మూలించగలిగితే ఉజ్వల భవిష్యత్తు ఉంది. సిరియాకు గొప్పతనాన్ని తిరిగి తీసుకురావడానికి చాలా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి నేతృత్వంలోని సిరియా ప్రభుత్వం.. పూర్తిగా మద్దతు ఇస్తుంది.’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
‘‘అమెరికన్లపై దాడి చేసేంత దుర్మార్గులైన ఉగ్రవాదులందరికీ ఇందుమూలంగా హెచ్చరిక జారీ చేయబడింది. మీరు ఏ విధంగానైనా అమెరికాపై దాడి చేసినా లేదా బెదిరించినా, మీరు ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా కొట్టబడతారు.’’ అని ఉగ్రవాద గ్రూపులకు ట్రంప్ కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.
‘‘డిసెంబర్ 13న సిరియాలోని పాల్మిరాలో అమెరికా దళాలపై ఐసిసి ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని.. ప్రతీకారంగా ఐసిసి స్థావరాలను నిర్మూలించేందుకు యూఎస్ దళాలు సిరియాలో ఆపరేషన్ హాకీ స్ట్రైక్‌ను ప్రారంభించాయి.’’ అని యుఎస్ యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఎక్స్‌లో పేర్కొన్నారు.


BREAKING: The United States has begun “massive” military operations in Syria aimed at eliminating ISIS fighters following an attack that killed 3 Americans
— Breaking911 (@Breaking911) December 19, 2025