Nilave: మ్యూజికల్ లవ్ డ్రామాగా ఆకట్టుకుంటున్న నెలవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nilave: సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ, సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ హీరోయిన్ గా నటించగా, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా కీ రూల్స్ ప్లే చేశారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. గీత రచయిత చంద్రబోస్ వీడియో బైట్ ద్వారా ఈ చిత్రం బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని చెబుతూ టీమ్‌ను అభినందించారు.
READ ALSO: Indus Waters Treaty: భారత్ ‘‘రావి’’ దెబ్బ.. పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం ఖాయం..
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. జెమిని సురేష్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూశాననే ఫీలింగ్ మనసుకు కలిగిందన్నారు. నేటి జనరేషన్ ‘గీతాంజలి’లా ‘నిలవే’ చిత్రం నిలుస్తుందన్నారు. హీరో సౌమిత్ మాట్లాడుతూ ..‘‘కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. రాజమౌళి గారు ‘బాహుబలి’ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా ‘నిలవే’ మాకు ‘బాహుబలి’ లాంటిది” అని అన్నారు. హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ..‘‘ప్రీతి పాత్రలో నన్ను నమ్మిన సౌమిత్‌కు థ్యాంక్స్. మొదటి చిత్రంతోనే సక్సెస్ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్‌కు థ్యాంక్స్”అని చెప్పారు. కార్యక్రమంలో దర్శకుడు సాయి కే వెన్నం, నిర్మాత రాజ్ అల్లాడ, మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్, చిత్ర బృందం పాల్గొంది.
READ ALSO: Peddi: ‘పెద్ది’ కెప్టెన్‌కు శివన్న సర్ప్రైజ్ గిఫ్ట్..
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!