Ukraine’s Zelensky Says Russia Using Cold As “Weapon Of Mass Destruction”: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తొమ్మిదో నెలకు చేరుకుంది. అయినా కూడా రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రష్యా, ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, ఆయుధ, సైనిక సహకారంతో ఉక్రెయిన్ బలమైన రష్యాను ఎదురించి పోరాడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహ ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఖేర్సన్, ఎల్వీవ్ వంటి నగరాలను లక్ష్యంగా చేసుకుంటూ రష్యా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఈ నగరాల్లోని మౌళిక సదుపాయాలను ధ్వంసం చేస్తోంది. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను నాశనం చేస్తోంది రష్యా.
Read Also: Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం..
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ రష్యాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రష్యా చలిని ‘సామూహిక విధ్వంస ఆయుధం’గా చేసుకుంటుందని ఆరోపించారు జెలన్ స్కీ. ఉక్రెయిన్ మౌళిక సదుపాయాలను దెబ్బతీయడం ద్వారా చలికి ప్రజలు చనిపోయేలా చేస్తోందని ఆయన మంగళవారం అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో చలికాలం ప్రారంభం అయింది. ప్రజలు తమ ఇళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు విద్యుత్ అవసరం అయితే ఆ విద్యుత్ వ్యవస్థనే టార్గెట్ చేస్తోంది రష్యా. దీని వల్ల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తోంది. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేలా చేయడమే రష్యా ఉద్దేశ్యం అని గతంలో జెలన్ స్కీ ఆరోపించారు.
ఈ శీతాకాలంలో ఉక్రెయిన్ మనుగడ సాధించాలంటే తమకు చాలా మద్దతు అవసరం అని పాశ్చాత్య దేశాలను, మిత్రదేశాలను కోరుతున్నారు జెలన్ స్కీ. ఉక్రెయిన్ అత్యవసర సేవల కోసం జనరేటర్లు, ఇతర పరికాలను పంపాలను ఫ్రెంచ్ మేయర్లతో జెలన్ స్కీ కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. రష్యా దాడులతో దేశంలోని పవర్ గ్రిడ్స్ కుప్పకూలుతుండటంతో మిలియన్ల మంది ఉక్రెయిన్ల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం హెచ్చరించింది. రష్యా ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడంతో దేశంలోని చాలా చోట్ల కరెంట్ లేకుండా పోయింది.