Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ ఆ దేశ పార్లమెంటరీ విచారణను ఎదుర్కోబోతున్నారు. భార్య అక్షతా మూర్తికి సంబంధించిన వ్యాపారానికి ప్రయోజనం కలిగించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భార్య వ్యాపారానికి సహాయపడేలా ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశంపై విచారణ ఎదుర్కొనున్నారు. ప్రధాని నిబంధనలను ఉల్లంఘించారా..? లేదా..? అనే విషయాన్ని తేల్చేందుకు పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ స్వతంత్ర అధికారి డేనియల్ గ్రీన్ బర్గ్ ఈ విచారణ బాధ్యతలను…