UK: హిందూ దేవాలయంపై దాడి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu temple targeted in UK.. India seeks action: భారత్, పాకిస్తాన్ ల మధ్య ఆగస్టు 28న జరిగిన క్రికెట్ మ్యాచ్ తరువాత నుంచి బ్రిటన్ లోని లీసెస్టర్ నగరంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇరు దేశాలకు చెందిన మద్దతుదారులు పరస్పరం దాడులు చేసుకుంటుండటంతో హింస చెలరేగుతోంది. ఇప్పటికే పోలీసు అధికారులు ఇరు పక్షాలు సంయమనం పాటించాలని కోరారు. ఇదిలా ఉంటే లీసెస్టర్ లోని ఓ హిందూ దేవాలయంపై గుర్తు తెలియన వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనను లండన్‌లోని భారత హైకమిషన్ హింసాకాండపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దాడిని ఖండించింది. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరింది.
ఈస్ట్ లీసెస్టర్ లోని హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి.. బయట ఉన్న కాషాయజెండాను గుర్తు తెలియని వ్యక్తుల పడేశారు. దీంతో మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. యూకే పోలీసులు ఉండగానే.. దుండగులు ఆలయాన్ని టార్గెట్ చేశారు. ఓ వ్యక్తి కాషాయ జెండాను లాగుతూ.. అక్కడ ఉన్న గుంపును ప్రేరేపించాడు.
Also Read
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
- China: జిన్‌పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక 'అసలు' మిస్టరీ ఇదేనా!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
Read Also: Yellow Alert for Hyderabad: మళ్లీ భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఆగస్టు 28న దుబాయ్‌లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ తర్వాత లీసెస్టర్‌లో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల చెలరేగాయి. రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. హిందూ ఆలయంపై దాడుల అనంతరం నుంచి మరింతగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ దాడులకు పాల్పడిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. బాధిత ప్రజలకు రక్షణ కల్పించాలని భారత హైకమిషన్ సోమవారం ఓ ప్రకటనలో కోరింది. లీసెస్టర్ సిటీలో ప్రస్తుతం భయానక పరిస్థితులు ఉన్నాయి.
లీసెస్టర్ షైర్ హింసలో పాల్గొన్నవారిలో 47 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. స్థానిక రాడికల్ ఇస్లాంవాదులు, హిందువుల ఇళ్లను, వాహనాలను టార్గెట్ చేస్తూ.. దాడులు చేస్తున్నారు. నాటింగ్‌హామ్, బర్మింగ్‌హామ్ లోని పలు ప్రాంతాల్లో కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
What appears to be a Hindu temple being targeted in Leicester as running street battles continue into the early hours.#Leicester pic.twitter.com/C2EfQXJNfz
— Paul B 🇬🇧 🔴 (@pauldbowen) September 18, 2022
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!