Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
- స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్
- వడ్డీ రేట్లను కేంద్రం ప్రకటించింది
- వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టే లక్షలాది మంది పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు) కోసం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను కేంద్రం ప్రకటించింది. ఈసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), కిసాన్ వికాస్ పత్ర (KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)తో పాటు అన్ని చిన్న పొదుపు పథకాలపై ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగనున్నాయి. కొత్త వడ్డీ రేట్లు జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి.
Also Read
- Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
- Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
- Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
- Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
ఏ పథకానికి ఎంత వడ్డీ?
సుకన్య సమృద్ధి యోజన (SSY): బాలికల భవిష్యత్ కోసం రూపొందించిన ఈ పథకంపై 8.20 శాతం వార్షిక వడ్డీ కొనసాగుతుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): దీర్ఘకాలిక పొదుపు కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ఈ పథకంపై 7.10 శాతం వార్షిక వడ్డీ యథాతథంగా ఉంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC): ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారికి 7.70 శాతం వడ్డీ లభిస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP): ఈ పథకంపై 7.50 శాతం వార్షిక వడ్డీ కొనసాగుతుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): వయోవృద్ధులకు అత్యధిక రాబడిని అందించే ఈ పథకంపై 8.20 శాతం వడ్డీ యథాతథంగా ఉంది.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS): ఈ పథకంపై 7.40 శాతం వార్షిక వడ్డీ అందుతుంది.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్: పొదుపు ఖాతాలపై 4.00 శాతం వార్షిక వడ్డీ కొనసాగుతుంది.
ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లపై కూడా ఎలాంటి మార్పు లేదు.
1 సంవత్సరం FD -6.90%
2 సంవత్సరాల FD – 7.00%
3 సంవత్సరాల FD – 7.10%
5 సంవత్సరాల FD – 7.50%
5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ (RD) – 6.70%
పెట్టుబడిదారులకు ఊరట
వరుసగా మరో త్రైమాసికం కూడా వడ్డీ రేట్లను మార్చకపోవడంతో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టే వారికి స్థిరమైన రాబడిపై స్పష్టత లభించింది. ముఖ్యంగా పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి ఈ నిర్ణయం ప్రయోజనకరంగా మారనుంది.
తాజావార్తలు
-
Sai Pallavi: “రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు”.. లాస్ ఎంజెల్స్ వేదికగా సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
-
West Asia Crisis: పశ్చిమాసియాలో భారతీయుల భద్రతపై ఆందోళన.. 22 మంది మృతి చెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడి
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
2027 Kawasaki Z900: Kawasaki Z900 బైక్ భారత్ లో లాంచ్.. 5-ఇంచ్ TFT డిస్ప్లే, 948cc ఇంజిన్, ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?