IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
- టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరణుడు
- అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా
- జూలై 4న మాంచెస్టర్‌లో రెండో టీ20
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England 1st T20I Abandoned Due to Rain: భారత్, ఇంగ్లండ్ మధ్య చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్సైడ్ స్టేడియంలో బుధవారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అభిషేక్ శర్మ మెరుపు అర్ధ సెంచరీ చేయగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇన్నింగ్స్ విరామం తర్వాత కురిసిన భారీ వర్షం కారణంగా ఇంగ్లండ్ ఒక్క బంతి కూడా ఆడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20 జూలై 4న మాంచెస్టర్‌లో జరగనుంది.
ఆరంభంలోనే భారత్‌కు షాక్:
టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నా.. పేలవ ఆరంభం దక్కింది. కేవలం ఆరు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్ (2) సాకిబ్ మహ్మూద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. ఆ వెంటనే ఇషాన్ కిషన్ (1) మరోసారి రనౌట్ అయ్యాడు. ఐర్లాండ్ సిరీస్‌లో జరిగిన తప్పిదమే మరోసారి పునరావృతం అయింది. ఈ సమయంలో అభిషేక్ శర్మ తన దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ పేసర్లు ల్యూక్ వుడ్, సాకిబ్ మహ్మూద్లపై ఎదురుదాడికి దిగిన అతడు బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా మహ్మూద్ వేసిన ఒక ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదడంతో భారత్ వేగంగా స్కోరు పెంచుకుంది.
Also Read
- Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..
- IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
- New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
- Team India: టీమిండియా జట్టులోకి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ..
కెప్టెన్ ఇన్నింగ్స్:
పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 61/2తో నిలవగా.. అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 25 బంతుల్లో 59 పరుగులు (6 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి సామ్ కరన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అభిషేక్ ఔటైన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. మొదట ప్రశాంతంగా ఆడిన అతడు ఆపై బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అద్భుతమైన పుల్ షాట్, ల్యూక్ వుడ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన శ్రేయస్.. కెప్టెన్‌గా తన తొలి టీ20 ఫిఫ్టీని నమోదు చేశాడు. ఐర్లాండ్ సిరీస్‌లో విఫలమైన తర్వాత ఈ ఇన్నింగ్స్ అతడికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. 46 బంతుల్లో 68 పరుగులు చేసి మహ్మూద్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.
చివర్లో మెరిసిన శివమ్ దూబే:
మిడిల్ ఓవర్లలో భారత్ పరుగుల వేగం కాస్త తగ్గినప్పటికీ.. చివర్లో శివమ్ దూబే దూకుడుగా ఆడి జట్టుకు కీలక పరుగులు అందించాడు. కేవలం 21 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచి.. చివరి ఐదు ఓవర్లలో భారత్‌కు 54 పరుగులు జోడించాడు. దీంతో టీమిండియా 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 190 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించాల్సి ఉండగా.. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో భారీ వర్షం మొదలైంది. వర్షం ఆగకపోవడంతో మైదానం పూర్తిగా తడిసిపోయింది. ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలించినప్పటికీ.. పరిస్థితులు మెరుగుపడకపోవడంతో చివరకు మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేశారు.
సిరీస్‌లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది:
మొదటి మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. భారత్ ఐర్లాండ్ సిరీస్ ఓటమి తర్వాత మెరుగైన బ్యాటింగ్‌తో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందగా.. ఇంగ్లండ్ మాత్రం తమ బలాన్ని చూపించే అవకాశం కోల్పోయింది. ఇక జూలై 4న మాంచెస్టర్‌లో జరిగే రెండో టీ20లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఐర్లాండ్ సిరీస్‌లో విఫలమైన భారత బ్యాటర్లు ఈ మ్యాచులో పుంజుకోవడం సానుకూలాంశం. సంజు, ఇషాన్ ఇంకా గాడిన పడాల్సి ఉంది.
తాజావార్తలు
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
-
TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?
-
Off The Record: వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!