Twitter Down: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మరోసారి పనిచేయలేదు. కొన్ని గంటల పాటు నెటిజెన్లు తమ ట్వీట్లను, లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత పలుమార్లు ఇలాగే ట్విట్టర్ డౌన్ అయింది. తాజాగా బుధవారం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ అంతరాయాన్ని ఎదుర్కొంది.
Twitter Layoff: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ట్విట్టర్ తో మొదలైన ఉద్యోగాల కోతలు ఆ తరువాత మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కొనసాగించాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఆర్థికమాంద్యాన్ని బూచిగా చూపుతూ చెప్పాపెట్టకుండా ఉద్యోగులను ఫైర్ చేస్తున్నాయి. ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గతేడాది తన సంస్థలో పనిచేస్తున్న 50 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. దాదాపుగా 3000కు పైగా ఉద్యోగులను తొలగించింది.
మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్‌లో మరోసారి ఉద్యోగాల కోత ఉండబోతున్న వార్తలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక భారీగా ఉద్యోగుల్ని తొలగించగా..మరోసారి అదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Elon Musk: అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్. ప్రపంచ కుబేరుడిగా ఆయనకు పేరు.అతను స్పేస్ ఎక్స్(Space X), టెస్లా(Tesla) కంపెనీలకు CEO. గతేడాది ఏప్రిల్‌లో రూ.3.5 లక్షల కోట్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. అతను ట్విట్టర్ కొనుగోలు సమయంలో తన టెస్లా కంపెనీలో వాటాలను విక్రయించడం ప్రారంభించాడు.