Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Trump Truth Social Hormuz Strait Oil Fortune Iran War

Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

Published Date :April 3, 2026 , 7:19 pm
By Venu Goapl Reddy
  • మరికొంత సమయం ఇస్తే హార్ముజ్‌ను తెరిపిస్తాం..
  • ప్రపంచానికి వెల్లువలా చమురు అందిస్తాం..
  • ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్..
Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హార్ముజ్ జలసంధి, ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొంత సమయం ఇస్తే, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి ఓపెన్ చేస్తుందని అన్నారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. చమురు సరఫరాకు కీలకంగా ఉన్న ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకోగలదని ట్రంప్ అన్నారు.

‘‘మరికొంత సమయం ఇస్తే, మనం హోర్ముజ్ జలసంధిని సులభంగా తెరవగలం, చమురును స్వాధీనం చేసుకోగలం, మరియు భారీగా లాభపడగలం. ఇది ప్రపంచానికి చమురు ప్రవాహాన్ని ఉప్పెనలా తెస్తుంది’’ అని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచంలోని చమురు రవాణాలో 20 శాతం హార్ముజ్ జలసంధి గుండా సాగుతుంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంది. ఈ జలమార్గం గుండా చమురు, గ్యాస్, సరకు రవాణా నౌకల్ని కంట్రోల్ చేస్తోంది.

Read Also: Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..

మరోవైపు, అమెరికా ప్రాధాన్యతలు మారుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇరాన్‌లో పాలనా మార్పు, ఎన్‌రిచ్డ్ యురేనియాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటిస్తే, ఇప్పుడు హార్ముజ్ జలసంధిని తెరిపించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మార్గం స్వేచ్ఛా నౌకాయానానికి ఇరాన్ అనుమతించాలని, అప్పుడే కాల్పుల విరమణ ఉంటుందని ఇటీవల ట్రంప్ చెప్పారు. ఈ జలసంధిని ఇరాన్ దిగ్భందిస్తే అమెరికా ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తుందని, పౌర విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే, దాడులు చేస్తే ఇజ్రాయిల్, గల్ఫ్ ప్రాంతాల్లోని యూఎస్ ఆస్తులపై భారీ దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Donald Trump
  • Energy crisis
  • Hormuz
  • Israel-Iran Conflict
  • Strait of Hormuz

తాజావార్తలు

  • Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..

  • Sajjala Ramakrishna Reddy: రాజధాని విషయంలో మాకు స్పష్టమైన వైఖరి ఉంది.. క్లారిటీ ఇచ్చిన సజ్జల

  • CSK vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. చెపాక్‌లో గెలిచేదెవరు?

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions