Epstein Files: అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘‘ఎప్‌స్టీన్’’ ఫైల్స్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను బహిర్గతం చేయాలని న్యాయశాఖను ఆదేశించే బిల్లుపై సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. డెమొక్రాట్లు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని, ఇప్పుడు అన్ని నిజాలు బయటపడుతాయని ట్రంప్ అన్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు 427 మంది అనుకూలంగా, ఒక్కరు వ్యతిరేకంగా ఓటేశారు.