Raj Tharun : యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్పట్లో వరుసహిట్లు కొట్టాడు. కానీ ఆడోరకం ఈడోరకం సినిమా తర్వాత ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. పైగా వరుస కాంట్రవర్సీ లతో ప్రేడ్ అవుట్ అవ్వడానికి రెడీ అయిపోయాడు. తాజాగా ఆయన నటించిన చిరంజీవ అనే సినిమా నేరుగా ఓటీడీలో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ ను సైలెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ఓ టి టి మూవీని జబర్దస్త్ కమెడియన్ అభి డైరెక్ట్ చేశాడు.
Read Also : Mass Jathara : రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ రిలీజ్
ఈ సినిమాలో హీరోకి ఒక ప్రమాదం జరగడం వల్ల.. ఎవరు ఎన్నేళ్లు బతుకుతారో తెలుస్తుంది. దాంతోపాటు వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల అనేక చిక్కుల్లో పడతాడు. మరి ఆ సమస్యలను ఎలా క్లియర్ చేసుకున్నాడు.. ఆ చిక్కుల్లో నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా కథ. ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న రాజ్ తరుణ్ ఏ సినిమాతో అయినా హిట్ కొడతాడా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే.
Read Also : Samantha : సమంత హీరోల సరసన నటించడం కష్టమేనా..?