అణు పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందని ట్రంప్ ప్రకటించారు. ఆదివారం సీబీఎస్ న్యూస్‌తో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు వెల్లడించారు. గతంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మలేషియా పర్యటనలో ఉన్న ఆయన మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు.