Site icon NTV Telugu

Trump: మోడీతో నేను బాగానే ఉన్నా.. ఆయనే నాతో సంతోషంగా లేరు.. ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు

Trump

Trump

ప్రధాని మోడీతో సంబంధాలపై మరోసారి అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు కారణంగా ప్రధాని మోడీ తనతో అంత సంతోషంగా లేరని.. తాను మాత్రం మోడీతో బాగానే ఉన్నానని పేర్కొన్నారు.

వైట్‌హౌస్‌లో జీవోపీ మెంటర్ రిట్రీట్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తనను చూడటానికి వచ్చారని తెలిపారు. ‘సర్.. దయచేసి నేను మిమ్మల్ని కలవవచ్చా’ అని అడిగారని.. కలవొచ్చని అన్నానన్నారు. ‘‘నాకు మోడీతో చాలా మంచి సంబంధం ఉంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందున చాలా సుంకాలు చెల్లిస్తున్నారు. దీంతో మోడీ నాతో అంత సంతోషంగా లేరు. అయితే ప్రస్తుతం రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని తగ్గించారు..’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

గతేడాది ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తొలుత భారత్‌పై 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున ఉక్రెయిన్‌తో యుద్ధం ఆగడం లేదని వెంటనే చమురు కొనుగోలు నిలిపివేయాలని ట్రంప్ హెచ్చరించారు. కానీ భారత్ చమురు కొనుగోలు నిలిపివేయలేదు. దీంతో భారత్‌పై జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఆ మధ్య రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తామని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ ప్రకటనను భారతదేశం గతంలోనే తోసిపుచ్చింది. ట్రంప్‌తో అలాంటి సంభాషణే జరగలేదని భారత్ స్పష్టం చేసింది.

Exit mobile version