Trump-White House: జో బైడెన్ చెత్త అధ్యక్షుడు.. వైట్‌హౌస్‌లో అధ్యక్షుల చిత్రపటాల కింద రాతలు
- వైట్‌హౌస్‌లో ‘ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్’ ఏర్పాటు
- డెమొక్రాటిక్ నేతలను విమర్శిస్తూ రాతలు
- అమెరికాను కాపాడేవాడు అంటూ ట్రంప్ చిత్రపటం కింద ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాను ఎవరు పరిపాలించినా అధ్యక్షుల ఫొటోలు వైట్‌హౌస్‌లో ఉంటాయి. డెమొక్రాటిక్ నేతలైనా.. రిపబ్లికన్ నేతలైనా వారి చిత్రపటాలు శ్వేతసౌధంలో ఉంచుతారు. కొత్తగా ‘ప్రెసిడెన్షియల్ వాక్ ఆఫ్ ఫేమ్’ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిని కలిసేందుకు వచ్చే అతిథులు, ప్రముఖులు గ్యాలరీని సందర్శించేలా ఏర్పాటు చేశారు. తాజాగా చిత్రపటాల కింద కొందరిపై విమర్శలు.. మరికొందరిపై పొగడ్తలతో కూడిన రాతలు ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Parastoo Ahmadi: హిజాబ్ ధరించనందుకు గాయనికి 74 కొరడా దెబ్బలతో శిక్ష
- China Women: ప్లీజ్ నన్నెవరైనా పెళ్లి చేసుకోండని గుక్కపెట్టి ఏడ్చిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో!
- Trump: ఇరాన్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వం.. స్విట్జర్లాండ్ చర్చలు వాయిదాపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
ఏయే కాలాల్లో ఎవరు.. ఎప్పుడు పరిపాలించారో వారి చిత్రపటాలు పెట్టారు. తాజాగా ఆ చిత్రపటాల కింద కొత్తగా రాతలు కూడా పొందిపరిచారు. ఆ రాతలు స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ రాసినట్లుగా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ప్రతి అధ్యక్షుడి గురించి వర్ణిస్తూ రాశారు. జో బైడెన్, బరాక్ ఒబామా, జిమ్మీ కార్టర్ వంటి డెమొక్రాటిక్ అధ్యక్షులపై తీవ్ర పదజాలాలు ప్రయోగించారు. రోనాల్డ్ రీగన్, రిచర్డ్ నిక్సన్ వంటి రిపబ్లికన్ నేతలపై మాత్రం ప్రశంసలు కురిపిస్తూ రాతలున్నాయి. ఇక జో బైడెన్ ఫొటో లేకుండానే రాతలు రాశారు. అమెరికా చరిత్రలో చెత్త అధ్యక్షుడు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జో బైడెన్…
జో బైడెన్‌కు సంబంధించిన రెండు ఫలకాలు ఉన్నాయి. ఆ చిత్రపటాలపై ‘‘ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు’’ అంటూ వర్ణిస్తూ రాతలు ఉన్నాయి. ఎన్నికల్లో అవినీతికి పాల్పడి పదవీ బాధ్యతలు స్వీకరించారంటూ ఆరోపించారు. ద్రవ్యోల్బణం, సరిహద్దు భద్రతా వైఫల్యాలు, ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ, అంతర్జాతీయ సంఘర్షణలకు దారి తీశాయంటూ నిందిస్తూ రాశారు. ఇంకో ఫలకంపై జో బైడెన్ ‘స్లీపీ’, ‘క్రూకెడ్’ అంటూ రాసి ఉన్నాయి. ట్రంప్ చిత్రపటం దగ్గర మాత్రం అమెరికాను కాపాడేవాడు అంటూ రాసి ఉంది.
ఒబామా…
ఇక ఒబామా చిత్రపటం దగ్గర ‘‘అమెరికన్ చరిత్రలో అత్యంత విభజనకర రాజకీయ వ్యక్తుల్లో ఒకరు’’ అంటూ రాసి ఉంది. అఫర్డబుల్ కేర్ చట్టం, ఇరాన్ అణు ఒప్పందం, పారిస్ వాతావరణ ఒప్పందాన్ని విమర్శిస్తూ రాతలు ఉన్నాయి. 2016లో ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై నిఘా పెట్టారని పేర్కొన్నారు.
జార్జ్ డబ్ల్యు బుష్..
ఇక జార్జ్ డబ్ల్యు బుష్ చిత్రపటం కింద కూడా విమర్శలు ఉన్నాయి. ఆప్ఘనిస్థాన్, ఇరాక్‌లో యుద్ధాలు ప్రారంభించారని.. ఈ రెండు కూడా జరిగి ఉండకూడదని రాసి ఉన్నాయి. ఇక ఆయన పదవి చివరి సంవత్సరంలో 2008లో దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని విమర్శించారు. ఇక డిసెంబర్ 2024లో మరణించిన జిమ్మీ కార్టర్ పదవీ కాలాన్ని కూడా విమర్శిస్తూ రాతలున్నాయి.

ఇది కూడా చదవండి: Maharashtra: ‘రమ్మీ’ మంత్రి మాణిక్‌రావ్ కోకటేకు మళ్లీ ఇక్కట్లు.. పదవికి రాజీనామా
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!