Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump New Oil Warning To Venezuela

Trump Warning: ఆ దేశాలతో సంబంధాలు తెంచుకోండి.. వెనిజులాకు ట్రంప్ వార్నింగ్

Published Date :January 7, 2026 , 1:43 pm
By Suresh Maddala
  • వెనిజులాపై అమెరికా పెత్తనం
  • రష్యా, చైనా, ఇరాన్‌ను బయటకు పంపండి
  • వెనిజులా కొత్త పాలనకు ట్రంప్ వార్నింగ్
Trump Warning: ఆ దేశాలతో సంబంధాలు తెంచుకోండి.. వెనిజులాకు ట్రంప్ వార్నింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

వెనిజులాకు ట్రంప్ మరో స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు. తక్షణమే చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని డెల్సీ రోడ్రిగ్జ్ నేతృత్వంలోని వెనిజులా ప్రభుత్వానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

గత శనివారం అమెరికా సైన్యం వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించి అమెరికా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి వెనిజులాపై అమెరికా పెత్తనం చెలాయిస్తోంది. చమురును స్వాధీనం చేసుకోబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇకపై చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నికైన డెల్సీ రోడ్రిగ్జ్‌కు ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Supreme Court: కుక్క ఏ మూడ్‌లో ఉందో ఎలా తెలుస్తుంది? కుక్కల బెడదపై కీలక ఆదేశాలు

ఇదిలా ఉంటే డిసెంబర్ చివరిలోనే చమురు బావులు మూసివేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమెరికా దిగ్బంధం చేయడంతో కొత్త నిల్వలు లేకపోవడంతో వెనిజులా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రోడ్రిగ్జ్ పాలన కూడా ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.

‘‘మొదట… చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలను తరిమికొట్టి ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలి… రెండవది.. వెనిజులా చమురు ఉత్పత్తిలో అమెరికాతో ప్రత్యేకంగా భాగస్వామిగా ఉండటానికి అంగీకరించాలి. భారీగా ముడి చమురును విక్రయించేటప్పుడు అమెరికాకు అనుకూలంగా ఉండాలి.’’ అని ట్రంప్ బృందం హెచ్చరించినట్లుగా వర్గాలు తెలిపాయి. చైనా చాలా కాలంగా వెనిజులాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అతిపెద్ద చమురు కొనుగోలుదారు చైనానే. ఇప్పుడు వెనిజులాను అమెరికా స్వాధీనం చేసుకున్నాక.. ఏ ఇతర దేశాల పెత్తనం ఉండకూడదని అమెరికా భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Maharashtra: మున్సిపల్ ఎన్నికల వేళ సరికొత్త రాజకీయం.. కాంగ్రెస్-బీజేపీ ఏం చేశాయంటే..!

నివేదిక ప్రకారం.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక ప్రైవేట్ సమావేశంలో శాసనసభ్యులతో మాట్లాడుతూ.. వెనిజులాలో ప్రస్తుతం చమురు ట్యాంకర్లు ఖాళీ అయ్యాయని.. ఈ నేపథ్యంలో ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తుందని తాను నమ్ముతున్నానని అన్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి రెండు వారాల్లో వెనిజులా దివాలా తీయొచ్చని అమెరికా అంచనా వేస్తోంది.

చమురుపై ట్రంప్ పెత్తనం
వెనిజులాలోని తాత్కాలిక అధికారులు మార్కెట్ ధరకు విక్రయించడానికి 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ఆ నిధులను తాను నియంత్రిస్తానని ట్రంప్ తెలిపారు. వెనిజులా, యునైటెడ్ స్టేట్స్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ఆ నిధులు ఉపయోగిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • Iran
  • New oil warning
  • Russia
  • trump

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions