Trump: నెతన్యాహు లేకుంటే ఇజ్రాయెల్ ఉనికిలో ఉండకపోయేది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- అమెరికాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పర్యటన
- తాజా పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ
- నెతన్యాహుపై ప్రశంసలు కురిపించిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెతన్యాహు ప్రధానిగా లేకుంటే ఇజ్రాయెల్ ఉనికిలో ఉండేదే కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. సోమవారం ఫ్లోరిడాలో ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కలిశారు. గాజా కాల్పుల విరమణ ప్రణాళిక తదుపరి దశకు వెళ్లే అంశంపై ట్రంప్‌తో నెతన్యాహు చర్చించారు. అయితే రెండో దశకు వెళ్లే ముందు హమాస్‌ను నిరాయుధీకరణ చేయాలని నెతన్యాహు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: కన్నడ టీవీ నటి నందిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
ఈ సందర్భంగా నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. నెతన్యాహు యుద్ధకాల ప్రధానమంత్రిగా అభివర్ణించారు. ఆ సమయంలో అద్భుతంగా పని చేశారంటూ కితాబు ఇచ్చారు. ఇజ్రాయెల్‌ను చాలా ప్రమాదకరమైన గాయం నుంచి బయటకు తీసుకువచ్చారని.. ఒక తప్పుడు ప్రధానమంత్రి ఉండుంటే.. ఈపాటికి ఇజ్రాయెల్ అనేది ఉనికిలోనే ఉండేది కాదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. పక్కనే ఉన్న నెతన్యాహు తల ఊపి నవ్వారు.
ఇది కూడా చదవండి: Khaleda Zia: బంగ్లాదేశ్‌లో విషాదం.. మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
ఇక సమావేశంలో ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గాజాలో ప్రభుత్వాన్ని ప్రకటించాలని.. అంతర్జాతీయ దళాలు మోహరించేలా చూడాలని ట్రంప్‌ను నెతన్యాహు కోరినట్లు సమాచారం. ఇక పర్యటనలో భాగంగా నెతన్యాహు ఫ్లోరిడాలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌లను కలిశారని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!