Trump-Netanyahu: వైట్‌హౌస్‌లో ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ.. ఇరాన్‌కు చివరి వార్నింగ్ ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో ట్రంప్-నెతన్యాహు కీలక భేటీ
- ఇరాన్ అణు ఒప్పందంపై రహస్య చర్చలు
- బోర్డ్ ఆఫ్ పీస్ ఫోరమ్‌లో సంతకం చేసిన నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అగ్ర రాజ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది. బుధవారం వైట్‌హౌస్‌లో 3 గంటల పాటు ట్రంప్-నెతన్యాహు రహస్యంగా సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఇక ఇద్దరి సమావేశం తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో చర్చలు జరుగుతున్నాయని.. దౌత్యం అనిశ్చితంగానే ఉందని తెలిపారు. చర్చలు విఫలమైతే సమన్వయం కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్‌తో నిరంతర చర్చలకు ఒత్తిడి తెచ్చానని.. ఇప్పటికీ చర్చలకు డోర్లు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తానికి వార్నింగ్‌ల దగ్గర నుంచి చర్చలకు ట్రంప్ తెరలేపారు.
Also Read
- Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
ఇది కూడా చదవండి: Lok sabha Video: పార్లమెంట్ దగ్గర ఆసక్తికర సన్నివేశం.. రాహుల్‌గాంధీ రాగానే కేంద్రమంత్రులు ఏం చేశారంటే..!
డిసెంబర్ 28 నుంచి ఇరాన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇక భద్రతా దళాల కాల్పుల్లో 30 వేల మంది చనిపోయారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగి.. నిరసనకారులను చంపితే సైనిక చర్యకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రానికి వచ్చి మోహరించింది. తక్షణమే అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర ఒత్తిడి చేశారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్-నెతన్యాహు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే బుక్‌పై అంతర్జాతీయ కుట్ర.. కేంద్ర దర్యాప్తులో ఏం తేలిందంటే..!
ఇదిలా ఉంటే అమెరికా నేతృత్వంలో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ పీస్‌లో ఇజ్రాయెల్ చేరింది. చాలా రోజుల తర్జన భర్జన తర్వాత నెతన్యాహు సంతకం చేశారు. ఈ ఫోరమ్‌లో పాశ్చాత్య భాగస్వాములతో పాటు టర్కీ, ఖతార్ కూడా ఉన్నాయి. గతంలో గాజాలో వారి పాత్రపై ఇజ్రాయెల్ విమర్శలు చేసింది. మొత్తానికి శాంతి మండలిలో ఇజ్రాయెల్ చేరింది.

తాజావార్తలు
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!