Stephen Miller: మిడ్‌టర్మ్ ఎన్నికల షాక్ తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్
- ట్రంప్ వైట్‌హౌస్‌లో భారీ మార్పులు
- సుసీ వైల్స్ స్థానంలో స్టీఫెన్ మిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stephen Miller Becomes Trump’s New Chief of Staff: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన కొద్ది రోజులకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న సుసీ వైల్స్‌ను ఆ పదవి నుంచి తప్పించి, ఆమె స్థానంలో తనకు అత్యంత నమ్మకమైన సహచరుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్‌ను నియమించారు. ప్రస్తుతం స్టీఫెన్ మిల్లర్ వైట్‌హౌస్‌లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సేవలందిస్తున్నారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, కఠిన వైఖరికి పేరుగాంచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
సుసీ వైల్స్కు కొత్త బాధ్యతలు
సుసీ వైల్స్‌ను పూర్తిగా పరిపాలన నుంచి తొలగించలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆమె ఇకపై ట్రంప్ పొలిటికల్ ఆపరేషన్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రకటించారు. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ మాట్లాడుతూ, సుసీ వైల్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా అద్భుతమైన పని చేశారని ప్రశంసించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ చేసిన తొలి కీలక నియామకాలలో సుసీ వైల్స్ ఒకరు.
Also Read
- India's Trusted Allies: భారత్‌కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
- France Bus Accident : ఫ్రాన్స్‌లో బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి..?
- Saltలో ఈ ఒక్క మార్పు చేయండి.. లక్షలాది ప్రాణాలు కాపాడండి! పరిశోధనలో కీలక విషయాలు
- Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
ట్రంప్‌కు సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నా: వైల్స్
తన పదవీ మార్పుపై సుసీ వైల్స్ స్పందిస్తూ, ట్రంప్ పరిపాలనలో సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. “ఈ రోజు వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నా చివరి రోజు. మనం కలిసి సాధించిన విజయాల్లో భాగం కావడం పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది,” అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. సరిహద్దు భద్రత, పన్నుల తగ్గింపు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, అమెరికా ఫస్ట్ విధానాలు వంటి అంశాల్లో సాధించిన విజయాలను ఆమె గుర్తు చేశారు. అధ్యక్షుడి పట్ల, అలాగే ప్రభుత్వ లక్ష్యం పట్ల తన నిబద్ధత ఏమాత్రం మారదని స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో సేవ చేయడం తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన అనుభవమని పేర్కొన్నారు.
ట్రంప్‌కు చిరకాల సహచరుడు స్టీఫెన్ మిల్లర్
41 ఏళ్ల స్టీఫెన్ మిల్లర్ చాలా కాలంగా డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహిత సహచరుడిగా ఉన్నారు. ముఖ్యంగా ట్రంప్ అమలు చేసిన కఠిన వలస విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ ప్రయోజన కార్యక్రమాల్లో మోసాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన యాంటీ-ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌లో కూడా ఆయన పనిచేశారు. అంతేకాకుండా వైట్‌హౌస్‌లో హోంల్యాండ్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
2016లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార బృందంలో చేరకముందు మిల్లర్ మాజీ సెనేటర్ జెఫ్ సెషన్స్ వద్ద సెనేట్ సహాయకుడిగా పనిచేశారు. ట్రంప్‌కు తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు తెలిపిన తొలి సెనేటర్లలో జెఫ్ సెషన్స్ కూడా ఒకరు. అనంతరం ఆయన ట్రంప్ ప్రభుత్వంలో అటార్నీ జనరల్‌గా పనిచేశారు.
“పోరాటానికి సిద్ధంగా ఉన్నా”.. మిల్లర్ వ్యాఖ్యలు
కొత్త బాధ్యతలు చేపట్టిన అనంతరం స్టీఫెన్ మిల్లర్ తన స్పందనలో తాను పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. “ఇప్పుడు మా లక్ష్యం గతంలో కంటే మరింత స్పష్టంగా ఉంది. మన అధ్యక్షుడికి మద్దతు ఇవ్వడానికి, గ్రేట్ రిపబ్లిక్ ను రక్షించడానికి మన ఆత్మతో పోరాడాలి,” అని మిల్లర్ X వేదికగా పేర్కొన్నారు. మొత్తానికి, మిడ్‌టర్మ్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్లకు ఎదురైన ఎదురుదెబ్బ తర్వాత ట్రంప్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ నియామకం ట్రంప్ ప్రభుత్వ రాజకీయ, పరిపాలనా వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: నేడే పరిషత్ ఎన్నికల కౌంటింగ్.. 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు..!
-
Stephen Miller: మిడ్‌టర్మ్ ఎన్నికల షాక్ తర్వాత ట్రంప్ కీలక నిర్ణయం.. కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!